సాక్షి, చెన్నై: తమిళనాట లోక్‌సభ ఎన్నికలకు డీఎంకే మెగా కూటమి ఖరారైంది. మిత్రులకు 20 సీట్లను డీఎంకే కేటాయించింది. మరో 20 స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ అ«ధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. పుదుచ్చేరి, తమిళనాడులో 40 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నాడీఎంకే– బీజేపీ నేతృత్వంలో ఓ మెగా కూటమి ఏర్పాటు చివరి దశలో ఉండగా డీఎంకే–కాంగ్రెస్ నేతృత్వంలో మరో కూటమి మంగళవారం రారైంది. సీట్ల సర్దుబాటు వివరాలను స్టాలిన్ ప్రకటించారు.
తమ కూటమిలోని కాంగ్రెస్‌కు పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలో 10 స్థానాలు కేటాయించామన్నారు. ఎండీఎంకేకు ఓ ఎంపీ సీటు, ఓ రాజ్యసభ సీటును ఖరారు చేసినట్టు వివరించారు. ఇక, సీపీఎం 2, సీపీఐ 2, వీసీకే 2, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ (ఐయూఎంఎల్) 1, కొంగునాడు దేశీయ మక్కల్ కట్చి(కేడీఎంకే)1, ఇండియ జననాయగ కట్చి(ఐజేకే)1లకు ఒకటి చొప్పున సీట్లు కేటాయించినట్టు ప్రకటించారు. మిత్రులకు 20 కేటాయించామని, తమ అభ్యర్థులు 20 స్థానాల్లో పోటీ చేస్తారని వివరించారు. డీఎంకే గుర్తుపై కేడీఎంకే, ఐజేకే అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్ అభ్యర్థులు కూడా ఇదే గుర్తుపై పోటీ చేసే అవకాశాలున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment