
న్యూఢిల్లీ : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణం పట్ల యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. ‘కలైంగర్ నా తండ్రి లాంటివారు. అటువంటి గొప్ప నాయకుడిని ఇక ముందు చూడలేం. దేశం కోసం, ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. తెలివైన నాయకత్వంతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారంటూ..’ కరుణానిధి కుమారుడు స్టాలిన్‌కు సోనియా భావోద్వేగ పూరిత లేఖ రాశారు.
కాగా మంగళవారం సాయంత్రం చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరుణానిధి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఆయన ఖననానికి మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment