సాక్షి, చెన్నై: ట్రిపుల్ తలాక్ బిల్లును స్టాండింగ్ కమిటీకి నివేదించాలని కోరిన డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌కు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) కృతజ్ఞతలు తెలిపింది. సజ్జద్ నొమానీ నేతృత్వంలో ఏఐఎంపీఎల్‌బీ కార్యవర్గ సభ్యులు సోమవారం స్టాలిన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని ధన్యవాదాలు తెలిపారని ఏఐఎంపీఎల్‌బీ పేర్కొంది. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని, దీనికి పాల్పడిన భర్తకు మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా పార్లమెంట్ ఇటీవల బిల్లును ఆమోదించిన విషయం విదితమే.
ట్రిపుల్ తలాఖ్‌ను నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తూ ఈ బిల్లు రూపొందింది. అయితే ఈ బిల్లు లోక్‌సభ ఆమోదంపై కేంద్రం తొందరపాటుతో వ్యవహరించిందని, దీన్ని స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment