standing commitee
-
మహిళలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా...సవరింపు చట్టం
హాంకాంగ్: లింగ వివక్ష, లైంగిక వేధింపుల నుంచి చైనాలో మహిళలకు మరింత రక్షణ కల్పించే లక్ష్యంతో చట్టాన్ని సవరించింది. విస్తృతమైన ప్రజాభిప్రేయ సేకరణ, పలు సవరణలు తదనంతరం ఈ చట్టాన్ని పార్లమెంట్‌కు సమర్పించింది. మహిళల హక్కులకు భంగం వాటిల్లకుండా, ప్రభుత్వం వారికి తగిన గౌరవం దక్కేలా చేయడం, అబార్షన్ పట్ల వస్తున్న నిర్భంధ వైఖరి తదితరాలపై కార్యకర్తల ఆందోళనల నేపథ్యంలో ఈ చట్టం వచ్చింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత చైనా మహిళల రక్షణ చట్టాన్ని సవరించడం ఇదే తొలిసారి. ఈ మేరకు మహిళల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ చట్టం ముసాయిదాను నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) స్టాండింగ్ కమిటీకి సమర్పించింది. ఐతే ఈ ముసాయిదాను ఇంకా అమలు చేయలేదు. సుమారు 10 వేల మంది ప్రజల సలహాలు, సూచనల కోసం పంపినట్లు ఎన్పీసీ తెలిపింది. ఈ ముసాయిదా చట్టం వెనుకబడిన, పేద, వృద్ధ, వికలాంగ మహిళల హక్కుల ప్రయోజనాలను మరింత బలోపేతం చేస్తోందని స్థానిక జిన్హుహ వార్త సంస్థ పేర్కొంది. ఈ చట్టం ప్రకారం....మహిళల శ్రమ, సామాజిక భద్రత హక్కుల ప్రయోజనాలను ఉల్లంఘిస్తే సదరు యజమానులను శిక్షిస్తుంది. మహిళల అక్రమ రవాణ, కిడ్నాప్, రక్షణను అడ్డుకోవడం తదితరాలను నేరాలుగా పరిగణిస్తుంది. అలాగే అక్రమ రవాణాకు గురైన లేదా కిడ్నాప్‌కి గురైన మహిళలను రక్షించే బాధ్యత అధికారులపై ఉంటుందని స్పష్టం చేసింది. (చదవండి: మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించే సంస్థను కొనుగోలు చేసిన తొలిమహిళ) -
ఫొటోలు దిగడం తప్ప ప్రజలకు చేసిందేమిటో..!
సాక్షి, హైదరాబాద్: బాధ్యతల స్వీకరణకు ముందు పలు వివాదాలకు కారణమై.. తీవ్ర ఉత్కంఠ రేపి ఎట్టకేలకు ఎన్నికయ్యాక రెండు నెలల తర్వాత పగ్గాలు చేపట్టిన జీహెచ్ఎంసీ పాలకమండలి ఏడాది కాలంలో ఏం చేసిందో కనిపించడం లేదు. పైపెచ్చు కార్పొరేటర్ల నుంచి మేయర్ వరకు అవకతవకలు, సొంతలాభం వంటి మరకలంటుకున్నాయి. ఇక మహిళా సాధికారత లక్ష్యంగా అతివలకు ప్రాధాన్యమిచ్చినా.. పతుల తోడు లేనిదే ముందుకు కదలని వారు ఎందరో. నగరం గురించి విజన్ ఉందని.. చేయాలనుకున్నవి చేసి చూపిస్తామన్న మేయర్ తన విజన్‌ను ఏమేరకు అమలు చేశారో ఆమెకే తెలియాలి. పాలకమండలి పగ్గాలు చేపట్టినప్పటికీ, స్వతంత్ర నిర్ణయాలతో పనిచేసిన దాఖలాల్లేవు. అధికారుల అజెండాలకు.. పాలకమండలి సభ్యులు పచ్చజెండాలూపి ఫొటోలు దిగడం తప్ప వారు చేసిందేమిటో ప్రజలకు తెలియడం లేదు. ► గత ఏడాది ఫిబ్రవరి 11న పాలకమండలి కొలువుదీరినప్పటికీ, జూన్ 29 వరకు సర్వసభ్య సమావేశమే జరగలేదు. బడ్జెట్ ఆమోదం కోసం వర్చువల్‌గా నిర్వహించారు. ఆ సమావేశంపై ప్రతిపక్ష బీజేపీ పెదవి అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం డిసెంబర్ 18న భౌతికంగా సమావేశాన్ని నిర్వహించినా.. బల్దియా చరిత్రలో అంతకు ముందెన్నడూ లేనివిధంగా కౌన్సిల్ హాల్లోకి మీడియాకు అనుమతి నిరాకరించి చీకటి దినంగా గుర్తుండేలా చేశారు. ► తమ వాణి వినిపించేలా సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పలుమార్లు డిమాండ్ చేసిన బీజేపీ సభ్యులు నవంబర్ 23న మేయర్ చాంబర్లో రణరంగం సృష్టించారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసులు నమోదు చేశారు. పాలకమండలి పగ్గాలు చేపట్టా క తొమ్మిదినెలల తర్వాత నవంబర్‌లో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. గతంలో మాదిరిగానే టీఆర్ఎస్, ఎంఐఎం పరస్పర ఒప్పందంతో టీఆర్ఎస్ నుంచి 8 మందికి ఎంఐఎం నుంచి ఏడుగురికి అవకాశం కల్పించారు. మరిన్ని విశేషాలు.. ► ఎస్ఎఫ్ఏల తొలగింపు, నియామకాల్లో జోక్యంతో మేయర్ సీటు వన్నె తగ్గింది. అధికారిక, అనధికారిక అన్ని కార్యక్రమాల్లోనూ డిప్యూటీ మేయర్ వెంట ఆమె భర్త ఉండటం చర్చనీయాంశంగా మారింది. మహిళా సాధికారతపై సంశయాలు రేకెత్తించింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్ఎంసీ నిధుల నుంచి మేయర్, డిప్యూటీ మేయర్ వంటి వారు కార్యాలయాలు, క్యాంప్ కార్యాలయాల ఆధునికీకరణల పేరిట నిధులు దుబారా చేయడం వారి ఆశను వెల్లడించింది. (చదవండి: నిషా ముక్త్ నగరమే లక్ష్యం) ► వానలు రావద్దని కోరుకుంటానంటూ మేయర్ వ్యాఖ్యానించడం, ఇంటికి జనరేటర్ కావాలని కోరడం వివాదాలకు కారణమయ్యాయి. స్వచ్ఛ హైదరాబాద్, పచ్చదనం పెంపు వంటి అంశాల్లో నగరం మెరుగైన ర్యాంక్ సాధించడం కలిసి వచ్చింది. ర్యాంకులొచ్చినా, స్వచ్ఛ ఆటోలు పెరిగినా, చెత్త సమస్యలు తీరలేదు. ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో పోస్టింగులకు ప్రాధాన్యం పెరిగింది. సామాన్య ప్రజల ఫిర్యాదులు స్వీకరించే దిక్కు లేకుండా పోయింది. ► పాలకమండలికి అధికార యంత్రాంగంపై పట్టులేక పోవడం వెల్లడైంది. జోన్లు,సర్కిళ్ల స్థాయిలో అవినీతి పెచ్చరిల్లిందనే విమర్శలున్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ ఎవరు కార్యాలయాలకు వస్తున్నారో, ఎవరు రావడం లేదో తెలియని దుస్థితి. అందరికీ బయోమెట్రిక్ హాజరు అన్నది పబ్లిసిటీకి మాత్రం పనికొచ్చింది. కంట్రోల్ రూమ్‌ల పేరిట ఖర్చులు పెరిగాయి. గతంలోని కంట్రోల్ రూమ్ చేయలేకపోయిందీ.. కొత్తగా ఏర్పాటు చేసింది చేస్తున్నదేమిటో పట్టించుకున్న వారు లేరు. (చదవండి: మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు!) ► కనీస సమాచారం సైతం కరువైన దుస్థితి నెలకొంది. ఇటీవలి కాలంలో మేయర్ జోన్లవారీ సమీక్షలు నిర్వహిస్తుండటం చెప్పుకోదగ్గ అంశం. సభా మర్యాదలు మంట గలిశాయి. ఒక్క సమావేశమే జరిగినా అర్థవంతమైన చర్చల సంగతటుంచి నువ్వా.. నేనా..? తేల్చుకుందామన్నట్లుగా వ్యవహరించారు. ఏడాదైనా వార్డు కమిటీలు ఏర్పాటు కాలేదు. ఇలా.. ఇంకా.. ఎన్నో.. ఎన్నెన్నో! -
జీవీఎంసీ జిమ్మిక్కులు: ఊ అంటారా.. ఊహు అంటారా..!
సాక్షి,విశాఖపట్నం: కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించి.. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు.. దుకాణాల వేలంపై కఠినంగా వ్యవహరించనున్నామని ప్రకటించిన జీవీఎంసీ.. ఇప్పుడు వాస్తవానికి సుదూరంగా నడుస్తోంది. గతంలో సరిగా అద్దెలు చెల్లించలేదనీ, రెన్యువల్ చేయకుండా మీనమేషాలు లెక్కించారంటూ దుకాణాల నిర్వహణను నిలుపుదల చేయడం, బినామీల నుంచి స్వాధీనం చేసుకోవడం వంటి కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించిన అధికారులు.. ఇప్పుడు మళ్లీ అదే బాటలో పయనిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కన ఉన్న ప్రైవేట్ షాపుల అద్దెల కంటే.. జీవీఎంసీ షాపులకు తక్కువ అద్దె వస్తుందనే కారణంతో కొత్తగా వేలం పాటలు నిర్వహించారు. ద్వారకా బస్‌స్టేషన్ సమీపంలో ఉన్న టీఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్‌లో మాత్రం వేలం పాటల నిర్ణయాలు విభిన్నంగా ఉన్నాయి. ఈ కాంప్లెక్స్‌లో షాప్ నం.25లో గతంలో రూ.25వేలు అద్దె చెల్లించేవారు. ఇప్పుడు వేలం వేయగా రూ.46 వేలుకు చేరింది. 26వ నంబర్ షాపు రూ.23,500 ఉండగా ప్రస్తుతం రూ.42వేలకు చేరింది. కానీ.. ఇదే షాపింగ్ కాంప్లెక్స్‌లో వెస్ట్ సైడ్ ఉన్న షాప్ నంబర్ 1.లో గతంలో రూ.65,000 అద్దె చెల్లించారు. కానీ.. ఇటీవల నిర్వహించిన వేలం పాటలో రూ.22,500కి మాత్రమే అప్పగిస్తూ వేలం ఖరారు చేసేశారు. అదేవిధంగా గతంలో రూ.53 వేలు అద్దె వచ్చే షాపు ఇప్పుడు రూ.24వేలకు, రూ.40 వేలు వచ్చే షాపుని రూ.35 వేలకు కట్టబెట్టేలా జీవీఎంసీ అధికారులు ఎత్తులు వేస్తున్నారు. అదేవిధంగా ప్రధాన జంక్షన్‌గా నిత్యం రద్దీగా ఉండే జగదాంబ జంక్షన్ షాపింగ్ కాంప్లెక్స్‌లోనూ దుకాణదారులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కైపోయారు. గతంలో వచ్చిన అద్దెల కంటే రూ.5 వేల వరకు తక్కువకే వేలం పాటలో ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారు. పాత బస్‌స్టాండ్ సమీపంలో ఉన్న షాపుల విషయంలోనూ ఇదే తీరుగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తూ.. గతంలో ఉన్న అద్దెలకే తిరిగి దుకాణాలు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సూర్యాబాగ్ వాణిజ్య సముదాయంలో షాప్ నం. 2కి గతంలో 23,900 అద్దె రాగా.. ఇప్పుడు రెవెన్యూ అధికారుల కుటిల యత్నాలతో అంతకు తగ్గించి రూ.21 వేలకు మాత్రమే వేలానికి వచ్చినట్లుగా నిర్ణయించారు. పద్మానగర్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక షాపుని కూడా ఇదే మాదిరిగా అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు నచ్చిన వారికి.. తమతో కుమ్మక్కైన వారికి దుకాణాలను తక్కువ అద్దెకు ఇచ్చేలా రెవెన్యూ యంత్రాంగం కుమ్మక్కైంది. స్టాండింగ్ కమిటీ చర్చిస్తుందా..? కార్పొరేషన్‌కు ఆదాయం పెంచకుండా తగ్గించేలా జరిగిన వేలం పాటల వ్యవహారాలన్నీ శుక్రవారం జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యుల ఎదుటకు చర్చకు రానున్నాయి. మొత్తం 60 అంశాలతో కూడిన అజెండాతో ఉదయం 11 గంటలకు స్టాండింగ్ కమిటీ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానుంది. మేయర్ హరివెంకటకుమారి స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తూ సమావేశం నిర్వహించనున్నారు. ఆదాయాన్ని హరించేలా జరిగిన వేలం పాటలకు సంబంధించిన వ్యవహారంపై కమిటీ సభ్యులు చర్చించి.. నిలుపుదల చేయనున్నారా.? లేదా.. అధికారుల పొంతన లేని సమాధానాలకు తలొగ్గి ఆమోదించనున్నారా? అనేది తేలనుంది. వేలం వ్యవహారంలో అధికారులు తమదైన శైలిలో సభ్యులను తప్పుదారి పట్టించేందుకు కావల్సిన అస్త్రాల్ని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. రిజర్వేషన్ల ప్రకారం తగ్గించి ఇచ్చామని కొన్ని దుకాణాలకు, వేలం పాటకు ఎవరూ రాలేదని మరికొన్ని దుకాణాలను కట్టబెట్టామని చెప్పేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. నగర అభివృద్ధికి దోహదపడేలా ఏం నిర్ణయం తీసుకోవాలో స్టాండింగ్ కమిటీ చేతుల్లోనే ఉందని కొందరు రెవెన్యూ సిబ్బంది వ్యాఖ్యానించడం కొసమెరుపు. చదవండి: నోట్లో గుడ్డలు కుక్కి.. పీక నులిమి హత్య! ఏం ఎరగనట్టు నాటకం.. -
వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు పెంచాలి
సాక్షి, ఢిల్లీ : దేశంలో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులతో పోలిస్తే ఎగుమతి సగటున 1 శాతం కూడా ఉండటం లేదని వాణిజ్యానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలో వెల్లడైంది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాల్సిన తక్షణ అవసరం ఉన్నట్లు కమిటీ అభిప్రాయపడింది. అందుకోసం తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ స్థాయీ సంఘం 154వ నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నివేదికను స్థాయీ సంఘం చైర్మన్ వి.విజయసాయి రెడ్డి.. రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడుకు అందించారు. రైతులు యాంటిబయాటిక్స్‌ను నియంత్రిత రీతిలో వినియోగించేందుకు అవసరమైన ఎక్స్టెన్షన్ సేవలను ప్రభుత్వ పర్యవేక్షణలో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ సిఫార్సు చేసింది. మత్స్య ఉత్పాదనల నాణ్యత, దిగుబడులే లక్ష్యంగా పరిశోధన, అభివృద్ధి చేపట్టాల్సిందిగా పేర్కొంది. దేశంలో ఏటా 800 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక పొగాకు సాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. పొగాకు ఉత్పాదనల ద్వారా ఏటా (2018-19 గణాంకాల ప్రకారం) సుమారు 6 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడం జరుగుతోంది. కానీ పొగాకు సాగుకు మాత్రం తగినంత ప్రోత్సాహం అందడం లేదని కమిటీ అభిప్రాయపడింది. (ఆర్బీఐ పేరుతో కాలయాపన : సుప్రీం ఆగ్రహం) పొగాకు సాగులో ఎఫ్‌డీఐని అనుమతించాలి 2017లో ప్రకటించిన ఎఫ్‌డీఏ విధానం ద్వారా కాఫీ, టీ, రబ్బర్, యాలకులు వంటి ప్లాంటేషన్ పంటల సాగులో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించారు. కానీ పొగాకు పంటకు ఆ వెసులుబాటు లేదు. కాబట్టి పొగాకు సాగులో కూడా ఎఫ్‌డీఐకి అనుమతించాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఎఫ్‌డీఐ ద్వారా సాగు చేసే పొగాకును ఆక్షన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా మాత్రమే మార్కెట్ చేయాలన్న నిబంధన ఉండాలని సిఫార్సుల్లో పేర్కొంది. సిగరెట్ల అమ్మకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ 1 శాతం సుంకం విధించి ఆ మొత్తాన్ని పొగాకు మార్కెట్ స్థిరీకరణ కోసం వినియోగించాలన్న టుబాకో బోర్డు సూచనను కమిటీ ప్రశంసిస్తూ ఈ దిశగా చర్యలు తీసుకోవలసిందిగా వాణిజ్య మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. దీని వలన మార్కెట్ సంక్షోభ పరిస్థితులలో రైతుల ఉత్పత్తులకు న్యాయమైన ధర లభిస్తుందని ఆయన చెప్పారు. (నా జీవితంలో మర్చిపోలేని ఘటన..) -
ట్రిపుల్ తలాక్ బిల్లు : స్టాలిన్‌కు థ్యాంక్స్
సాక్షి, చెన్నై: ట్రిపుల్ తలాక్ బిల్లును స్టాండింగ్ కమిటీకి నివేదించాలని కోరిన డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌కు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) కృతజ్ఞతలు తెలిపింది. సజ్జద్ నొమానీ నేతృత్వంలో ఏఐఎంపీఎల్బీ కార్యవర్గ సభ్యులు సోమవారం స్టాలిన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని ధన్యవాదాలు తెలిపారని ఏఐఎంపీఎల్బీ పేర్కొంది. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని, దీనికి పాల్పడిన భర్తకు మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా పార్లమెంట్ ఇటీవల బిల్లును ఆమోదించిన విషయం విదితమే. ట్రిపుల్ తలాఖ్‌ను నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తూ ఈ బిల్లు రూపొందింది. అయితే ఈ బిల్లు లోక్‌సభ ఆమోదంపై కేంద్రం తొందరపాటుతో వ్యవహరించిందని, దీన్ని స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. -
బీజేపీకి టీడీపీ ఝులక్
స్టాండింగ్ కమిటీలో దక్కని చోటు గతంలో ఇచ్చిన హామీకి మంగళం బీజేపీ స్పందనపై కార్పొరేషన్ వర్గాల్లో ఆసక్తి రాజమహేంద్రవరం: మిత్ర పక్ష బీజేపీకి అధికార టీడీపీ చేయిచ్చింది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీలో చోటు ఇవ్వకుండా వ్యూహం రచించింది. రెండో దఫా అవకాశం ఇస్తామన్న హామీని నెలబెట్టుకోకపోవడంతో ఇరు పార్టీల మధ్య పొరపొచ్చాలు బయటపడుతున్నాయి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పాలక మండలి ఎన్నికలు 2014 ఏప్రిల్‌లో జరిగాయి. 50 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 34, వైఎస్సార్సీపీ 8, బీజేపీ 01, బీఎస్పీ 01, కాంగ్రెస్ 01, స్వతంత్రులు మరో ఐదు డివిజన్లలో గెలుపొందారు. మేయర్ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ తమ సభ్యులతో స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. టీడీపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉండడంతో ప్రతి ఏడాది జరిగే ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో దఫా స్టాండింగ్ కమిటీలో తమకు చోటు కల్పించాలని బీజేపీ కోరింది. అయితే బీజేపీ మాటను పెడచెవిన పెట్టిన అధికార పార్టీ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల నేతృత్వంలో ఐదు స్థానాలు తమ వారికే కట్టబెట్టింది. కడలి రామకృష్ట(1వ డివిజన్), పితాని లక్ష్మీకుమారి(2వ డివిజన్), బూర దుర్గాంజనేయుల రావు(27వ డివిజన్), గాడిరెడ్డి నరశింహరావు(33వ డివిజన్), సింహా నాగమణి(40వ డివిజన్)లు స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో స్టాండింగ్ కమిటీలో చోటు ఆశించిన బీజేపీ కార్పొరేటర్ రేలంగి శ్రీదేవీ(47వ డివిజన్)కి ఆశాభంగం తప్పలేదు. దీంతో ఆమె కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, గోరంట్లతో మంతనాలు జరిపారు. వచ్చేసారి తప్పక స్థానం కల్పిస్తామని గోరంట్ల హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఈసారి రిక్తహస్తమే... అయితే మూడో దఫాలో కూడా బీజేపీకి రిక్త హస్తమే ఎదురైంది. బుధవారంతో ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. ఐదు స్థానాలకు టీడీపీ తరఫున కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేశారు. అంతకు ముందు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికపై అధికారపార్టీలో తీవ్ర స్థాయిలో మంతనాలు జరిగాయి. ఎవరిని సభ్యులుగా నియమించాలన్నదానిపై పలుమార్లు ముఖ్యనేతలు సమావేశమయ్యారు. నామినేషన్‌కు ముందు గోరంట్ల నివాసంలో సభ్యుల ఎంపికపై మంతనాలు జరిగాయి. చివరికి ఇన్నమూరి రాంబాబు(23వ డివిజన్), మజ్జి మౌనికా సుధారాణి(6వ డివిజన్), తంగేటి వెంకట లక్ష్మి(15వ డివిజన్), మానుపాటి తాతారావు(18వ డివిజన్), మళ్ల నాగలక్ష్మి(32వ డివిజన్) కార్పొరేటర్లు నామినేషన్లు వేశారు. ఇతరులు పోటీ చేయకపోవడంతో వచ్చే నెల 10న జరిగే వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే గత ఏడాది తమకు ఇచ్చిన హామీని పట్టించుకోకపోవడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ మిత్ర ధర్మాన్ని పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఎమ్మెల్యే గోరంట్ల ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని వారు మండిపడుతున్నారు. ఇలా అయితే తమకు ఇక విలువేముందని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హామీ నిలబెట్టుకోకపోవడంపై సోము వీర్రాజు ఏ విధంగా స్పందిస్తారు, దీనికి గోరంట్ల ఏం సమాధానం చెబుతారోనన్న చర్చ కార్పొరేషన్ వర్గాల్లో నడుస్తోంది. ముఖ్య పాత్ర స్టాండింగ్ కమిటీదే... కార్పొరేషన్ పాలక మండలి సాధారణ సమావేశం ప్రతి మూడు నెలలకోసారి జరుగుతుంది. ఈ సమావేశంలో నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, విధాన నిర్ణయాలుపై చర్చించి ఆమోదం తెలుపుతారు. అయితే మిగతా సమయంలో నగరంలో జరిగే అభివృద్ధి పనులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలుపుతుంది. ప్రతి వారం మేయర్ అధ్యక్షతన సమావేశమై రూ. 50 లక్షల లోపు పనులను ఆమోదిస్తుంది. ఇంతటి ప్రాధాన్యమున్న స్టాండింగ్ కమిటీలో సభ్యత్వం కోసం ప్రతి సారి కార్పొరేటర్లు ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. -
ఒకటో స్థాయి సంఘం సమావేశం వాయిదా
హన్మకొండ : జిల్లా ప్రజాపరిషత్ 1వ స్థాయి సంఘం సమావేశం వాయిదాపడింది. మంగళవారం హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి వివిధ శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. దీంతో హాజరైన సభ్యులు సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు. దీంతో చైర్పర్సన్ గద్దల పద్మ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని తిరిగి సెప్టెంబర్ 1న నిర్వహించనున్నట్లు తెలిపారు. జెడ్పీ సీఈఓ ఎస్.విజయ్‌గోపాల్, జెడ్పీటీసీ సభ్యులు మూలగుండ్ల వెంకన్న, లేతాకుల సంజీవరెడ్డి, పాడి కల్పన, పాలకుర్తి సారంగపాణి, స్వామినాయక్ హాజరయ్యారు. -
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నేడే
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ స్టాండింగ్ కమిటీ ఎంపిక ప్రక్రియ కొంతమంది కార్పొరేటర్లను ఒత్తిడికి గురిచేస్తోంది. స్టాండింగ్ కమిటీ సభ్య పదవికి పోటీ చేయదల్చే కార్పొరేటర్లు నేడు సాయంత్రం 3 గంటల్లోగా తమ నామినేషన్ల పత్రాలను బల్దియా ప్రధాన కార్యాలయంలో సమర్పించాలి. మంగళవారం ఉదయం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మేయర్ సమావేశమై స్టాండింగ్ కమిటీలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆశావహులైన కార్పొరేటర్లు ఒత్తిడికి లోనవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఐదున్నర సంవత్సరాల వ్యవధి తర్వాత బల్దియాలో పాలక వర్గం ఏర్పడింది. వీరిలో 80 శాతం కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఉండగా, కొంతమంది సీనియర్లూ ఉన్నారు. వీరిలో పలువురు ఆశావహులు తమకంటే తమకు స్టాండింగ్ కమిటీలో అవకాశం కల్పించాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ల బలం అత్యధికంగా కలిగి ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఆరు స్టాండింగ్ కమిటీ పదవులను కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఆ పార్టీలోని ఆశావహుల నడుమ తీవ్ర పోటీ నెలకొంది. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి 2 స్టాండింగ్ కమిటీ పోస్టులు, అందులో ఒకటి అండర్ రైల్వే గేట్ ప్రాంతానికి, మరొకటి వరంగల్ ప్రాంతానికి కేటాయించనున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇద్దరికి, వర్ధన్నపేట నుంచి ఒకరికి, పరకాలకు ఒక స్థానం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
స్టాండింగ్ కమిటీలో నాయిని అల్లుడు, కేకే కుమార్తె
హైదరాబాద్: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అల్లుడు వి. శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ ముఖ్యనేత కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ గత పాలకమండలిలో బీజేపీ ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించిన బంగారి ప్రకాశ్లకు స్థానం లభించింది. వీరితో పాటు ఎంఐఎం నాయకులు ఎంఏ గఫార్, మీర్జా ముస్తాఫాబేగ్లకు సైతం స్థానం లభించింది. మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకు గాను 46 మంది నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, 31 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో మిగిలిన 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. జీహెచ్ఎంసీలో అధికారిక టీఆర్ఎస్కు 99 మంది సభ్యుల బలం ఉండగా, ఎంఐఎంకు 44 మంది సభ్యుల బలం ఉంది. ఒక్కో స్టాండింగ్ కమిటీ సభ్యుని ఎన్నికకు కనీసం పదిమంది సభ్యుల బలం అవసరం. ఈ లెక్కన టీఆర్ఎస్కు ఇతర పార్టీల నుంచి ఏ ఒక్కరి మద్దతు లభించినా పది మంది ఎన్నికయ్యేందుకు అవకాశమున్నప్పటికీ, ఎంఐఎంతో స్నేహపూర్వక ఒప్పందాలతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఉపసంహరణల అనంతరం బరిలో మిగిలిన 9 మంది టీఆర్ఎస్ సభ్యులు, ఆరుగురు ఎంఐఎం సభ్యులు స్టాండింగ్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రూ.3 కోట్ల వరకు అధికారం.. జీహెచ్ఎంసీలో రూ. 3 కోట్ల మేర పనుల మంజూరు అధికారం స్టాండింగ్ కమిటీకి ఉండటంతో స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎంతో డిమాండ్ ఉంది. వీరు ఏడాదిపాటు సభ్యులుగా కొనసాగుతారు.