AYUSH ministry
-
తిప్పతీగపై తప్పుడు ప్రచారం.. ఆయుష్ మంత్రిత్వశాఖ క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: తిప్పతీగ వినియోగిస్తే ఎలాంటి హానికర ప్రభావం ఉండదని ఆయుష్ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. తిప్పతీగ కాలేయాన్ని దెబ్బతీస్తుందంటూ కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారం తప్పు అని ఆయుష్ శాఖ బుధవారం ఓ ప్రకటనలో ఖండించింది. ఆయుర్వేదంలో ఉత్తమ పునరుజ్జీవన మూలికగా పేర్కొనే తిప్పతీగ సారం ఎలాంటి విష ప్రభావాన్ని కల్గించదని అధ్యయనాలు పేర్కొన్నాయని తెలిపింది. ఔషధం భద్రత ఎంత అనేది వినియోగించే అంశంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. నిపుణుడైన వైద్యుడి సూచన మేరకు ఔషధం తగిన మోతాదులో వినియోగించుకోవాలని సూచించింది. మూలికా ఔషధ మూలాల్లో నిజమైన నిధిగా భావించే తిప్పతీగ పలు రుగ్మతలను తగ్గిస్తుందని పేర్కొంది. జ్వరాలు, డయేరియా, అల్సర్, క్యాన్సర్, ఆందోళన తదితర రుగ్మతల నివారణకు వినియోగించే తిప్పతీగ కరోనా నియంత్రణకూ వినియోగించినట్లు పేర్కొంది. ఔషధ ఆరోగ్య ప్రయోజనాలు పరిగణనలోకి తీసుకొంటే తిప్పతీగ విషపూరితమని చెప్పలేమని కేంద్ర మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. చదవండి: (1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న నాగార్జున) -
ఇప్పటికీ దరఖాస్తు చేసుకోలేదు.. ఆనందయ్యకు నోటీసులు ఇచ్చాం: ఆయుష్ శాఖ
సాక్షి, విజయవాడ: అనుమతులు లేకుండా ఒమిక్రాన్‌కు మందు ఉందంటూ ప్రచారం చేసుకుంటున్న సంస్థలపై ఆయుష్ శాఖ చర్యలు తీసుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లాలో అనుమతులు లేకుండా ఒమిక్రాన్ పేరుతో ఆయుర్వేద మందులు అమ్ముతున్న ఓ సంస్థను ఆయుష్ శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయుష్ కమిషనర్ రాములు మాట్లాడుతూ.. ఒమిక్రాన్ పేరుతో అనుమతులు లేని ఆయుర్వేద మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒమిక్రాన్‌కు మందు ఇస్తానంటూ ప్రచారం చేసుకుంటున్న ఆనందయ్యకు కూడా నోటీసులు ఇచ్చామని తెలిపారు. చదవండి: హైదరాబాద్, వైజాగ్‌లలో భారీగా అప్రెంటిస్ ట్రెయినీలు ఆనందయ్య తన మందుపై ఇప్పటికీ ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకోలేదని వెల్లడించారు. ఆనందయ్య మందుపై కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనే ప్రభుత్వం పది రోజుల వ్యవధిలో వేగంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేంద్ర ఆయుష్ శాఖ కోవిడ్ నివారణకు సూచించిన అన్ని ఆయుర్వేదం, హోమియో మందులు అన్ని డిస్పెన్సరీలలో అందుబాటులో ఉంచామని చెప్పారు. వీటి కోసం ఏపీ ప్రభుత్వం 13 కోట్ల రూపాయిలు ఖర్చు చేసిందన్నారు. ఒమిక్రాన్‌కు మందు ఉందంటూ ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్న ప్రచారాలని నమ్మి మోసపోవద్దని ఆయుష్ కమిషనర్ సూచించారు. ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీలలో కేంద్ర అయుష్ శాఖ సూచించిన మందులనే వినియోగించాలని తెలిపారు. చదవండి: మహిళా పోలీసులకు ప్రత్యేక నిబంధనలను విడుదల చేసిన ప్రభుత్వం -
రికార్డు సృష్టించిన ‘కరోనిల్ కిట్’....
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణ ఔషధం పేరుతో పతంజలి విడుదల చేసిన ‘కరోనిల్ కిట్’పై ఎంత దుమారం రేగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కిట్‌లో "దివ్య స్వసరి వతి", "దివ్య కొరోనిల్ టాబ్లెట్", "దివ్య అను తైల్" అనే ఔషధాలుంటాయి. అయితే తొలుత దీన్ని కరోనాని తగ్గించే మందుగా.. ఆ తర్వాత నివారణ ఔషధంగా పేర్కొన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి కంపెనీకి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈ వివాదాలు ఎలా ఉన్నప్పటికి జనాలు మాత్రం ‘కరోనిల్ కిట్’ని బాగానే వాడారు. నాలుగు నెలల వ్యవధిలోనే ఈ కిట్ 250 కోట్ల రూపాయల బిజినేస్ చేసినట్లు కంపెనీ ప్రకటించింది. భారత్‌తో పాటు విదేశాల్లో కూడా ఈ కిట్‌ని అమ్మినట్లు తెలిపింది. అక్టోబర్ 18 వరకు పతంజలి ఆయుర్వేద కంపెనీ దాదాపు 2.5 మిలియన్ల కరోనిల్ కిట్లను అమ్మిందని.. వీటి విలువ సుమారు 250 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారిక వెబ్సైట్లో తెలిపింది. ఇండియాతో పాటు విదేశాల్లో ఆన్లైన్, పతంజలి స్టోర్లు, డైరెక్ట్ మార్కెటింగ్, మెడికల్ షాపుల ద్వారా 25మిలియన్ల కిట్లు అమ్మినట్లు తెలిపింది. (కరోనా ఔషధం : పతంజలి కొత్త ట్విస్టు) ఇక ‘కరోనిల్ కిట్’ని ఈ ఏడాది జూన్ 23న లాంచ్ చేసింది. ఈ ఉత్పత్తి కరోనా వైరస్‌ని తగ్గిస్తుందని తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. ఇక కరోనిల్ లాంచ్‌తో దేశవ్యాప్తంగా వివాదం రేగడంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ కిట్ ట్రయల్స్‌కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తమకు అందిచాల్సిందిగా ఆదేశించింది. అంతేకాక ‘కరోనిల్ కిట్’.. కోవిడ్‌కి ఔషధం అంటూ ఇచ్చిన ప్రకటనలను కూడా బ్యాన్ చేసింది. అమ్మకాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో పతంజలి కరోనిల్ గురించి చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకున్నారు. ఇది కరోనాని తగ్గించదని.. కేవలం రోగ నిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు. ఈ ప్రకటన తర్వాత ఆయూష్ మంత్రిత్వ శాఖ రోగనిరోధక శక్తి పెంచే కిట్‌గా కరోనిల్ అమ్మకాలకు అనుమతిచ్చారు. దాంతో గత నాలుగు నెలల్లో కరోనిల్ రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. 250 కోట్ల రూపాయలు విలువ చేసే 25 కిట్లను అమ్మినట్లు తెలిపారు. -
హిందీ రాకుంటే దేశం విడిచి వెళ్లిపోవాలా?
బెంగుళూరు : హిందీ భాషపై తమిళనాడులో తీవ్ర వివాదం చెలరేగుతూనే ఉంది. తమిళ వైద్యులకు హిందీ తెలియదని ఆయుష్మాన్ భారత్ కార్యదర్శి రాజేష్ కోట్చే వ్యవహరించిన తీరు తమిళనాట ఆగ్రహాన్ని రేపింది. హిందీ రాకుంటే శిక్షణా కార్యక్రమం నుంచి బయటకు వెళ్లాలంటూ వ్యాఖ్యలు చేసిన రాజేష్ కొట్చేపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ రానంత మాత్రానా ఇతర భాషల వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాలా అంటూ ఫైర్ అయ్యారు. దేశ ఐక్యత సమాఖ్యవాదంపై ఆధారపడి ఉంటుందని, భారత్‌లో అన్ని భాషలు సమానమేనని అన్నారు. హిందీ అర్థం కాకుంటే వెళ్లిపోండి అనడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మాట్లాడిన ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కుమారస్వామి డిమాండ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. (ఇది హిందీ ప్రభుత్వం కాదు: కమల్) వివరాల్లోకి వెళ్తె, సెంటర్ ఫర్ డాక్టర్స్ నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో ఆయుష్ యూనియన్ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా స్పందిస్తూ.. తాను ఇంగ్లీషులో మాట్లాడనని, తాను హిందీలోనే మాట్లాడతానని, హిందీ అర్థం కాని వారు సమావేశం నుంచి వెళ్లిపోవచ్చని తెలిపారు. కాగా ఈ సమావేశానికి తమిళనాడుకు చెందిన 37 మంది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. యోగా మాస్టర్ ట్రైనర్స్ కోసం ఆయుష్ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే చాలా సెషన్లు హిందీలో జరిగాయని కొందరు ఆరోపిస్తున్నారు. తమిళ డాక్టర్లను అవమానించేలా ఆయుష్మాన్ భారత్ కార్యదర్శి రాజేష్ కోట్చే వ్యవహరించిన తీరు పట్ల తమిళ పార్టీలు, సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. (హిందీ దుమారం) -
ఇది హిందీ ప్రభుత్వం కాదు: కమల్
చెన్నై: ఆయుష్ శాఖపై మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు, ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. తమిళ వైద్యులకు హిందీ తెలియదని ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. కాగా, ఆయుష్ శాఖకు తమిళమే అర్థం కానప్పుడు తమిళనాడు మందులు ఏలా అర్థమవుతాయని తమిళ వైద్యలు ఆయుష్ శాఖను ప్రశ్నించకపోవడం వైద్యుల వినయానికి నిదర్శమని కమల్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే భాషలో పనిచేయడం ప్రభుత్వ బాధ్యత అని, ఇది హిందీ ప్రభుత్వం కాదని, భారత ప్రభుత్వం అని గట్టిగా కౌంటరిచ్చారు. వివరాల్లోకి వెళ్తె, సెంటర్ ఫర్ డాక్టర్స్ నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో ఆయుష్ యూనియన్ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా స్పందిస్తూ.. తాను ఇంగ్లీషులో మాట్లాడనని, తాను హిందీలోనే మాట్లాడతానని, హిందీ అర్థం కాని వారు సమావేశం నుంచి వెళ్లిపోవచ్చని తెలిపారు. కాగా ఈ సమావేశానికి తమిళనాడుకు చెందిన 37 మంది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. యోగా మాస్టర్ ట్రైనర్స్ కోసం ఆయుష్ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే చాలా సెషన్లు హిందీలో జరిగాయని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ.. ఆయుష్ శాఖ శిక్షణ తరగతిలో హిందీ తెలియని వారు వెళ్లిపోవచ్చని ఆయుష్ కార్యదర్శి రాజేష్ కొట్టెచా పేర్కొనడాన్ని కనిమోళి తీవ్రంగా తప్పుబట్టారు. ఆయనపై శాఖాపరమైన క్రమశిక్షణ తసుకోవాలని డిమాండ్ చేశారు. హిందీ తెలియకపోతే ఎన్ని రోజులు అవమానిస్తారని ధ్వజమెత్తారు. చదవండి: వైరల్ : ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో సేతుపతితో కమల్ -
కరోనా ఔషధం : పతంజలి కొత్త ట్విస్టు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా నివారణకు పతంజలి ఆయుర్వేద ఔషధంలో మరో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. కోవిడ్-19 క్లినికల్ ట్రయల్‌కు సంబంధించిన అన్ని పత్రాలను ఆయుష్ మంత్రిత్వ శాఖతో పంచుకున్నామని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ప్రకటించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖకు, పతంజలికి మధ్య అభిప్రాయ భేదాలు లేవంటూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ మందులు కరోనా నివారణకు పనిచేస్తాయని ఎప్పుడూ పేర్కొనలేదని పతంజలి సీఈవో బాలకృష్ణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే తాజా పరిణామం చోటు చేసుకోవడం విశేషం. (పతంజలి కరోనా మందుకు బ్రేక్!) కరోనా కిట్‌లో "దివ్య స్వసరి వతి", "దివ్య కొరోనిల్ టాబ్లెట్", "దివ్య అను తైల్" అనే ఔషధాలను భారతదేశం అంతటా తయారు చేసి పంపిణీ చేయడానికి మంత్రిత్వ శాఖ అనుమతి ఉందని పతంజలి తాజాగా ప్రకటించింది. తమ ఔషధానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్ పత్రాలను ఆయుష్, భారత ప్రభుత్వంతో పంచుకున్నట్లు పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ తెలిపింది. కోవిడ్-19 నిర్వహణపై తగిన విధంగా పనిచేసిందని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టంగా అంగీకరించిందని ప్రకటించింది. ఈ ఔషధాన్ని తీసుకున్న కరోనా రోగులు 3 రోజుల్లో 67 శాతం, 7 రోజుల చికిత్స అనంతరం 100 శాతం కోలుకున్నారని పునరుద్ఘాటించింది. అలా మొత్తం 45 మందికి తమ చికిత్స అనంతరం కరోనా నెగిటివ్ ఫలితం వచ్చిందని తెలిపింది. (మాట మార్చిన ‘పతంజలి’.. అది కోవిడ్ మందు కాదు!) కాగా ఆయుర్వేద కంపెనీ పతంజలి కరోనా మహమ్మారికి కరోనిల్ కిట్ పేరుతో ఆయుర్వేద మందు కనుగొన్నామంటూ సంచలన ప్రకటన చేసింది. దీనిపై స్పందించిన కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పూర్తి వివరాలను ప్రకటించాలని నిర్వాహకులకు నోటీసులు లిచ్చింది. దీంతో పతంజలి ఆయుర్వేద మందుపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. Patanjali claims that "#COVID19 patients group that received its medicines, showed 67% recovery in 3 days & 100% recovery in 7 days of treatment, that is, all 45 patients became COVID negative"; says all clinical trial documents have been shared with AYUSH Ministry. pic.twitter.com/jSMTxCwLp8 — ANI (@ANI) July 1, 2020 -
పతంజలి కరోనా మందుకు బ్రేక్!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నివారణకు ఆయుర్వేద మందును లాంచ్ చేసిన యోగా గురు రాందేవ్ నేతృత్వంలోని పతంజలి సంస్థకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది. ఆయుర్వేద ఔషధం కరోనిల్ ప్రారంభానికి ముందు నిర్వహించిన పరిశోధనల పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థను ఆదేశించింది. అంతేకాదు అప్పటివరకూ ఎలాంటి ప్రచారాన్ని చేపట్టవద్దని కూడా మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. పతంజలి చెబుతున్న అంశాలపై వాస్తవాలు, శాస్త్రీయ అధ్యయన వివరాలు మంత్రిత్వ శాఖకు తెలియదని పేర్కొంది. ('కరోనిల్' 80 శాతం సక్సెస్‌ను చూపించింది) పతంజలి అట్టహాసంగా కరోనిల్ మందును ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ మందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. కోవిడ్-19 నివారణకు గాను పతంజలి తయారు చేసిన ఆయుర్వేద మందును ఏ మోతాదులో, ఏయే ఆసుపత్రిలలో పరిశీలించారు, సంబంధిత పరిశోధన ఫలితాల తాజా డేటా, ఇనిస్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ క్లియరెన్స్, సీటీఆర్ఐ రిజిస్ట్రేషన్ వివరాలను తమకు అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. వీటిని సమగ్రంగా పరిశీలించేంతవరకు ప్రచారాన్ని ఆపాలని పతంజలి సంస్థను ఆదేశించింది. దీంతోపాటు కరోనిల్ తయారీకి మంజూరు చేసిన లైసెన్స్ కాపీలు, అనుమతి వివరాలను అందించాలని మంత్రిత్వ శాఖ ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కోరింది. పతంజలి ప్రధాన కార్యాలయం హరిద్వార్‌లో ఉంది, ఇది ఉత్తరాఖండ్ అధికార పరిధిలోకి వస్తుంది. రాజస్థాన్ జైపూర్ నిమ్స్ వైద్యులతో పాటు పలువురు శాస్త్త్రవేత్తల సహకారంతో 150కి పైగా ఔషధ మూలికలతో కరోనిల్ ఔషదాన్ని రూపొందించామని పతంజలి సంస్థ ప్రకటించింది. క్లినికల్ కంట్రోల్ స్టడీ, క్లినికల్ కంట్రోల్ ట్రయల్ చేశాకే తాము కరోనిల్ మందును మార్కెట్లో విడుదల చేశామని రాందేవ్ వెల్లడించారు. తమ మందు వాడిన కరోనా వైరస్ రోగులలో ఎక్కువ మంది 14 రోజుల్లో, దాదాపు 80 శాతం కోలుకున్నారని పతంజలి సహ వ్యవస్థాపకుడు బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా భారతదేశంలో 425,000 మందికి పైగా కరోనావైరస్ బారిన పడగా, 14,000 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య తొమ్మిది మిలియన్లను దాటింది. మరణాల సంఖ్య 470,000 పైకి చేరుకుంది. -
చ్యవన్‌ప్రాశ్ తినండి.. తులసి టీ తాగండి
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శరీర సహజ రక్షణ వ్యవస్థను కాపాడుకోవడం ముఖ్యం. అందుకోసం రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి. ప్రకృతిసిద్ధమైన ఆయుర్వేదం అందుకు దోహదపడుతుంద’ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందుకోసం రోజువారీ వంటకాల్లో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, పసుపు క్రమం తప్పకుండా వినియోగించాలని సూచించింది. రోగ నిరోధకశక్తిని పెంచే వీటి వినియోగాన్ని పెంచడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలుపుతూ ఈ ఆయుర్వేద మార్గదర్శకాలను జారీ చేసింది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఈ సూచనలను జిల్లాల అధికారులకు పంపింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు వీటిని పాటించాలని పేర్కొంది. ఆరోగ్యం కోసం ‘ఆయుష్’ సూచిస్తోన్న ఆయుర్వేద సూత్రాలివే.. శరీర సహజ రక్షణ వ్యవస్థ కోసం.. ► గోరువెచ్చని నీటినే తాగాలి. రోజులో ఏ సమయంలోనైనా అవే తాగాలి. ► రోజూ అరగంట పాటు యోగా, ప్రా ణాయామం, ధ్యానం చేయాలి. ► వంటకాల్లో కచ్చితంగా పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పక వినియోగించాలి. వీటి వినియోగం ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇవి తినండి.. ఆరోగ్యంగా ఉండండి ► విటమిన్లు, ప్రొటీన్లతో కూడిన బలవర్ధక ఆహారం తీసుకోవాలి. ► క్యారెట్, ఆకుకూరలు, కీరా, పండ్లు, కర్బూజ తగినంతగా తీసుకోవాలి. ► ద్రాక్ష, కివీ, కమలాలు, చేపలు, గుడ్లు, పాలు, సోయా, శనగలు, చిక్కుడు గింజలు వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తి కోసం.. ► రోజూ ఉదయమే పది గ్రాముల (ఒక స్పూన్) చ్యవన్‌ప్రాశ్ తీసుకోవాలి. ► హెర్బల్ టీ తాగాలి. లేదా తులసి/దాల్చిన చెక్క/ నల్ల మిరియాలు (బ్లాక్ పెప్పర్) శొంఠి వేసిన డికాషన్ తాగాలి. రుచి కోసం అందులో బెల్లం, నిమ్మరసం వేసుకోవచ్చు. రోజులో ఒకటి– రెండుసార్లు ఎండు ద్రాక్ష తినాలి. ► 150 మిల్లీలీటర్ల వేడి పాలలో అర టీస్పూన్ పసుపు వేసుకొని రోజులో ఒకటీ రెండుసార్లు తాగాలి. ఇలా చేస్తే ఆరోగ్యభాగ్యం ► నువ్వుల లేదా కొబ్బరినూనె లేదా నెయ్యి చుక్కలు రోజూ ఉదయం, సాయంత్రం ముక్కు రంధ్రాల్లో వేసుకోవాలి. ► నువ్వుల లేదా కొబ్బరి నూనె ఒక స్పూన్ మేర నోట్లో వేసుకోవాలి. 2 – 3 నిమిషాల పాటు దాన్ని పుక్కిలించి ఉమ్మివేయాలి. ఆపై గోరువెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా నిత్యం ఒకటీ రెండుసార్లు చేయాలి. ► గొంతుమంట, పొడి దగ్గు ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాలి. సాధారణ ఉపశమనం కోసం పుదీనా ఆకులతో ఆవిరి పట్టుకోవాలి. బెల్లం లేదా తేనెతో లవంగాల పౌడర్ కలుపుకొని రోజూ రెండుసార్లు తాగాలి. -
భారీగా యోగా ట్రైనర్ ఉద్యోగాలు
న్యూఢిల్లీ: యోగా బహుళ ప్రాచుర్యం క్పలిస్తూ అంతర్జాతీయ యోగ దినోత్సవాలను ఘనంగా నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలో భారీ ఉద్యోగాల కల్పనకు దిగనుంది. యోగ సాధనకు మరింత మంది ప్రజలు ముందుకు వస్తున్నతరుణంలో భారీ యోగా శిక్షకులు ఉపాధి కల్పించనుంది. సుమారు 10 వేల సర్టిఫికేట్ యోగా శిక్షకులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆయూష్ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ఈ విషయాన్ని గురువారం ప్రకటించారు. మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం గత రెండు సంవత్సరాల్లో దేశంలో యోగా శిక్షకుల సంఖ్య 30 శాతం పెరిగింది. ప్రస్తుతం భారతీయుల్లో యోగ ప్రముఖంగా మారిపోయిందని మరిన్ని ప్రైవేట్ సంస్థలు వారి వారి కార్యాలయాల్లో యోగా శిక్షకులను నియమించుకుంటున్నాయిన ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉమ్మడి సలహాదారు (యోగా) ఈశ్వర ఆచార్య తెలిపారు. ఇటీవల హర్యానా ప్రభుత్వం వెయ్యి ఖాళీలను ప్రకటించిందన్నారు. ధృవీకరించిన యోగా శిక్షకుల అవసరం ఉన్న సంస్థలను గుర్తించేలా అన్ని ఇతర రాష్ట్రాలకు తాము లేఖాలు రాశారమన్నారు. 2015 లో ముందు, సర్టిఫికేషన్ సదుపాయం లేదనీ కానీ, సంప్రదాయ అభ్యాసానికి నాణ్యతను అందించడానికి భారత నాణ్యతా మండలి ద్వారా వీటిని ఇప్పుడు అక్రిడిటేషన్ చేస్తున్నామని ఆచార్య చెప్పారు.