భారీగా యోగా ట్రైనర్ ఉద్యోగాలు
న్యూఢిల్లీ: యోగా బహుళ ప్రాచుర్యం క్పలిస్తూ అంతర్జాతీయ యోగ దినోత్సవాలను ఘనంగా నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలో భారీ ఉద్యోగాల కల్పనకు దిగనుంది. యోగ సాధనకు మరింత మంది ప్రజలు ముందుకు వస్తున్నతరుణంలో భారీ యోగా శిక్షకులు ఉపాధి కల్పించనుంది. సుమారు 10 వేల సర్టిఫికేట్ యోగా శిక్షకులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఆయూష్ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ఈ విషయాన్ని గురువారం ప్రకటించారు. మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం గత రెండు సంవత్సరాల్లో దేశంలో యోగా శిక్షకుల సంఖ్య 30 శాతం పెరిగింది. ప్రస్తుతం భారతీయుల్లో యోగ ప్రముఖంగా మారిపోయిందని మరిన్ని ప్రైవేట్ సంస్థలు వారి వారి కార్యాలయాల్లో యోగా శిక్షకులను నియమించుకుంటున్నాయిన ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉమ్మడి సలహాదారు (యోగా) ఈశ్వర ఆచార్య తెలిపారు.
ఇటీవల హర్యానా ప్రభుత్వం వెయ్యి ఖాళీలను ప్రకటించిందన్నారు. ధృవీకరించిన యోగా శిక్షకుల అవసరం ఉన్న సంస్థలను గుర్తించేలా అన్ని ఇతర రాష్ట్రాలకు తాము లేఖాలు రాశారమన్నారు. 2015 లో ముందు, సర్టిఫికేషన్ సదుపాయం లేదనీ కానీ, సంప్రదాయ అభ్యాసానికి నాణ్యతను అందించడానికి భారత నాణ్యతా మండలి ద్వారా వీటిని ఇప్పుడు అక్రిడిటేషన్ చేస్తున్నామని ఆచార్య చెప్పారు.