బెంగుళూరు : హిందీ భాషపై తమిళనాడులో తీవ్ర వివాదం చెలరేగుతూనే ఉంది. తమిళ వైద్యులకు హిందీ తెలియదని ఆయుష్మాన్ భారత్ కార్యదర్శి రాజేష్ కోట్చే వ్యవహరించిన తీరు తమిళనాట ఆగ్రహాన్ని రేపింది. హిందీ రాకుంటే శిక్షణా కార్యక్రమం నుంచి బయటకు వెళ్లాలంటూ వ్యాఖ్యలు చేసిన రాజేష్ కొట్చేపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ రానంత మాత్రానా ఇతర భాషల వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాలా అంటూ ఫైర్ అయ్యారు. దేశ ఐక్యత సమాఖ్యవాదంపై ఆధారపడి ఉంటుందని, భారత్‌లో అన్ని భాషలు సమానమేనని అన్నారు. హిందీ అర్థం కాకుంటే వెళ్లిపోండి అనడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మాట్లాడిన ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కుమారస్వామి డిమాండ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. (ఇది హిందీ ప్రభుత్వం కాదు: కమల్)
వివరాల్లోకి వెళ్తె, సెంటర్ ఫర్ డాక్టర్స్ నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో ఆయుష్ యూనియన్ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా స్పందిస్తూ.. తాను ఇంగ్లీషులో మాట్లాడనని, తాను హిందీలోనే మాట్లాడతానని, హిందీ అర్థం కాని వారు సమావేశం నుంచి వెళ్లిపోవచ్చని తెలిపారు. కాగా ఈ సమావేశానికి తమిళనాడుకు చెందిన 37 మంది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. యోగా మాస్టర్ ట్రైనర్స్ కోసం ఆయుష్ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే చాలా సెషన్లు హిందీలో జరిగాయని కొందరు ఆరోపిస్తున్నారు. తమిళ డాక్టర్లను అవమానించేలా ఆయుష్మాన్ భారత్ కార్యదర్శి రాజేష్ కోట్చే వ్యవహరించిన తీరు పట్ల తమిళ పార్టీలు, సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. (హిందీ దుమారం)
Comments
Please login to add a commentAdd a comment