హిందీ భాషను అభివృద్ధి చేయాలి
-
బీజేపీ ఎంపీ బలిరామ్ గైక్వాడ్
నెల్లూరు(సెంట్రల్) : రాష్ట్రంలో హిందీభాషను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రాజ్‌బాషా (హిందీ) హైపవర్ కమిటీ సభ్యులు, మహారాష్ట్రలోని లాధూర్ నియోజకవర్గ బీజేపీ పార్లమెంటు సభ్యులు సునీల్ బలిరామ్ గైక్వాడ్ అన్నారు. హిందీభాష పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయంపై రెండు రోజుల నెల్లూరు పర్యటనకు ఆయన బుధవారం విచ్చేశారు. ఎంపీ మాట్లాడుతూ హిందీని కేంద్ర కార్యాలయాల్లో తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ వెంట పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.