బుల్లితెరపై ఎన్నో షోలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ బిగ్‌బాస్ మాత్రం అన్ని షోలకు బాస్‌గా ఇక్కడే సెటిలైపోయింది. పలు ప్రాంతీయ భాషల్లో ప్రసారమవుతూ ఎందరో ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా హిందీ బిగ్‌బాస్ 13 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని 14వ సీజన్‌లో అడుగు పెట్టింది. బిగ్‌బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల హడావుడి ఒకత్తైతే, బయట వారి అభిమానులు చేసే సందడి మరో ఎత్తు ఉంటుంది. నామినేషన్‌లోకి వచ్చిన ప్రతీసారి ఓట్లు గుద్దుతూ అభిమానాన్ని చాటుకుంటారు. అయితే బిగ్‌బాస్ 14వ సీజన్ వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ రెండోవారానికిగానూ ఎలిమినేషన్ లేదని బాంబు పేల్చారు. అలా అని ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంటు ఇంట్లో ఎప్పటిలాగే స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ తిరిగే అవకాశమూ లేదు. ఎలిమినేషన్‌కు బదులుగా "ఇన్విజిబుల్" అని కొత్త ప్రయోగానికి తెర తీశారు. (చదవండి: గోళ్లతో రక్కిన కంటెస్టెంటు, కళ్లకు గాయాలు)
నిజానికి ఈసారి షెహజాద్ డియోల్, అభినవ్ శుక్లా, జాన్ కుమార్ సను నామినేషన్‌లో ఉండగా షెహజాద్ ఇన్విజిబుల్‌గా ఉంటారని సల్మాన్ వెల్లడించారు. అలాగే అతడు 'గాయబ్' అని రాసి ఉన్న దుస్తులను ధరించాల్సి ఉంటుంది. ఇకపై అతడు ఎలాంటి కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉండడు. హౌస్‌లో ఉంటాడన్న మాటే కానీ ఏ టాస్కులోనూ పాల్గొనడు. బిగ్‌బాస్ ఆదేశాల మేరకు నడుచుకుంటాడు. బిగ్‌బాస్ తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అతడు ఇన్విజిబుల్‌గానే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ అతని ప్రవర్తన నచ్చకపోతే ఏ క్షణమైనా హౌస్ నుంచి బయటకు పంపించి వేస్తారు. ఇక ఈ ప్రక్రియ విజయవంతమైతే మిగిలిన ప్రాంతీయ భాషల్లో కూడా ఎలిమినేషన్‌కు బదులు ఇన్విజిబుల్ అమలు చేసే అవకాశముందని తెలుస్తోంది. అయితే హిందీ బిగ్‌బాస్‌లో ప్రవేశపెట్టిన ఇన్విజిబుల్ ప్రక్రియ ఈ వారానికే పరిమితమవుతుందా? వచ్చే వారాల్లోనూ కొనసాగనుందా? అనేది తెలియాల్సి ఉంది. (చదవండి: టూ మచ్ బిగ్‌బాస్.. ఓట్లు ఎందుకు మరి?)
Comments
Please login to add a commentAdd a comment