Shehzad
-
'ఇది పురుషుల రాష్ట్రం'... వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి
జైపూర్: రాజస్తాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్ అసెంబ్లీలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయంన అసెంబ్లీలో మాట్లాడుతూ..."రేప్ కేసుల్లో మనమే నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. ఎందుకంటే రాజస్తాన్ పురుషుల రాష్ట్రం." అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజస్తాన్ బీజేపీ చీఫ్ సతీష్ పూనియా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్, జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ రేఖా శర్మ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. అంతేకాదు సతీష్ పూనియా శాంతి ధరివాల్ మహిళలను అవమానించడమే కాక పురుషుల గౌరవాన్ని దిగజార్చారని ఆరోపించారు. ఈమేరకు షెహజాద్ ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేగాక కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఉద్దేశించి ప్రియాంక జీ ఇప్పుడు ఏం చెబుతారు, ఏం చేస్తారు అని గట్టిగా కౌంటరిస్తూ ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. SHOCKING DISGUSTING BUT NOT SURPRISING Rajasthan's cabinet minister laughs & says in the assembly that Rajasthan is number 1 in rape because it is a “state of men” (mardon ka pradesh). LEGITIMISING RAPE AFTER KARNATAKA CONGRESS MLA NOW THIS PRIYANKA VADRA SILENT pic.twitter.com/dBY8f7MBSy — Shehzad Jai Hind (@Shehzad_Ind) March 9, 2022 (చదవండి: జమ్మూలో పేలుడు) -
ఎలిమినేషన్ ఎత్తేసిన బిగ్‌బాస్
బుల్లితెరపై ఎన్నో షోలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ బిగ్‌బాస్ మాత్రం అన్ని షోలకు బాస్‌గా ఇక్కడే సెటిలైపోయింది. పలు ప్రాంతీయ భాషల్లో ప్రసారమవుతూ ఎందరో ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా హిందీ బిగ్‌బాస్ 13 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని 14వ సీజన్లో అడుగు పెట్టింది. బిగ్‌బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల హడావుడి ఒకత్తైతే, బయట వారి అభిమానులు చేసే సందడి మరో ఎత్తు ఉంటుంది. నామినేషన్లోకి వచ్చిన ప్రతీసారి ఓట్లు గుద్దుతూ అభిమానాన్ని చాటుకుంటారు. అయితే బిగ్‌బాస్ 14వ సీజన్ వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ రెండోవారానికిగానూ ఎలిమినేషన్ లేదని బాంబు పేల్చారు. అలా అని ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంటు ఇంట్లో ఎప్పటిలాగే స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ తిరిగే అవకాశమూ లేదు. ఎలిమినేషన్‌కు బదులుగా "ఇన్విజిబుల్" అని కొత్త ప్రయోగానికి తెర తీశారు. (చదవండి: గోళ్లతో రక్కిన కంటెస్టెంటు, కళ్లకు గాయాలు) నిజానికి ఈసారి షెహజాద్ డియోల్, అభినవ్ శుక్లా, జాన్ కుమార్ సను నామినేషన్లో ఉండగా షెహజాద్ ఇన్విజిబుల్గా ఉంటారని సల్మాన్ వెల్లడించారు. అలాగే అతడు 'గాయబ్' అని రాసి ఉన్న దుస్తులను ధరించాల్సి ఉంటుంది. ఇకపై అతడు ఎలాంటి కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉండడు. హౌస్‌లో ఉంటాడన్న మాటే కానీ ఏ టాస్కులోనూ పాల్గొనడు. బిగ్‌బాస్ ఆదేశాల మేరకు నడుచుకుంటాడు. బిగ్‌బాస్ తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అతడు ఇన్విజిబుల్‌గానే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ అతని ప్రవర్తన నచ్చకపోతే ఏ క్షణమైనా హౌస్ నుంచి బయటకు పంపించి వేస్తారు. ఇక ఈ ప్రక్రియ విజయవంతమైతే మిగిలిన ప్రాంతీయ భాషల్లో కూడా ఎలిమినేషన్‌కు బదులు ఇన్విజిబుల్ అమలు చేసే అవకాశముందని తెలుస్తోంది. అయితే హిందీ బిగ్‌బాస్‌లో ప్రవేశపెట్టిన ఇన్విజిబుల్ ప్రక్రియ ఈ వారానికే పరిమితమవుతుందా? వచ్చే వారాల్లోనూ కొనసాగనుందా? అనేది తెలియాల్సి ఉంది. (చదవండి: టూ మచ్ బిగ్‌బాస్.. ఓట్లు ఎందుకు మరి?) -
డోపింగ్‌లో పట్టుబడిన షెహజాద్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓపెనర్ అహ్మద్ షెహజాద్ డోప్ టెస్టులో విఫలమయ్యాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పాకిస్తాన్ కప్ వన్డే టోర్నీ సందర్భంగా సేకరించిన శాంపుల్స్‌లో అతను డోపింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. దీంతో పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) షెహజాద్‌పై విచారణకు ఆదేశించింది. ప్రత్యేక కమిటీ ముందు అతను విచారణకు హాజరుకానున్నాడు. పాకిస్తాన్ తరఫున 13 టెస్టులు, 81 వన్డేలు, 57 టి20లు ఆడిన షెహజాద్‌పై కనిష్టంగా 3 నెలలు... గరిష్టంగా 6 నెలలు సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. ప్రాథమిక పరీక్షలో షెహజాద్ డోపింగ్‌కు పాల్పడినట్లు రుజువైందని... పూర్తి స్థాయి విచారణ అనంతరం అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు బోర్డు అధికారి తెలిపారు. -
షెహజాద్ వీరవిహారం
షార్జా: నాణ్యమైన ప్రత్యర్థి ఎదురైనా... ఏమాత్రం తడబాటు లేకుండా ఆడిన అఫ్గానిస్తాన్ జట్టు ఓపెనర్ మొహమ్మద్ షెహజాద్ (67 బంతుల్లో 118 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) రెండో టి20 మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన చేశాడు. జింబాబ్వే బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. దీంతో షార్జా క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు చేసింది. షెహజాద్ 52 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. ఘని (5), అస్గర్ (18), కరీమ్ (12) విఫలమైనా... షెహజాద్ మాత్రం చివరి వరకు ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. కీలకభాగస్వామ్యాలను నెలకొల్పుతూ ప్రతి బంతిని పరుగుగా మల్చడంతో అఫ్గాన్ రన్‌రేట్ వేగంగా పరుగెత్తింది. చివర్లో ధాటిగా ఆడిన నబీ (12 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు) షెహజాద్‌తో ఐదో వికెట్‌కు 47 పరుగులు జత చేశాడు. అఫ్గాన్ బ్యాట్స్‌మన్ వీరబాదుడును అడ్డుకోలేకపోయిన జింబాబ్వే బౌలర్లు పదేపదే వైడ్లు వేయడం... ఫీల్డింగ్‌లోనూ ఒత్తిడికి లోనై సులభంగా అందుకోవాల్సిన క్యాచ్‌లను జారవిడిచి భారీ స్కోరుకు కారకులయ్యారు.