జైపూర్: రాజస్తాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్ అసెంబ్లీలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయంన అసెంబ్లీలో మాట్లాడుతూ..."రేప్ కేసుల్లో మనమే నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. ఎందుకంటే రాజస్తాన్ పురుషుల రాష్ట్రం." అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజస్తాన్ బీజేపీ చీఫ్ సతీష్ పూనియా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్, జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్‌పర్సన్ రేఖా శర్మ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు.
అంతేకాదు సతీష్ పూనియా శాంతి ధరివాల్ మహిళలను అవమానించడమే కాక పురుషుల గౌరవాన్ని దిగజార్చారని ఆరోపించారు. ఈమేరకు షెహజాద్ ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేగాక కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఉద్దేశించి ప్రియాంక జీ ఇప్పుడు ఏం చెబుతారు, ఏం చేస్తారు అని గట్టిగా కౌంటరిస్తూ ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది.
SHOCKING
— Shehzad Jai Hind (@Shehzad_Ind) March 9, 2022
DISGUSTING
BUT NOT SURPRISING
Rajasthan's cabinet minister laughs & says in the assembly that Rajasthan is number 1 in rape because it is a “state of men” (mardon ka pradesh). LEGITIMISING RAPE
AFTER KARNATAKA CONGRESS MLA NOW THIS
PRIYANKA VADRA SILENT pic.twitter.com/dBY8f7MBSy
(చదవండి: జమ్మూలో పేలుడు)
Comments
Please login to add a commentAdd a comment