
సాక్షి, ముంబై: ఐపీఎల్ పుణ్యమా.. విదేశి క్రికెటర్లు ప్రతి ఏటా భారత్‌కు వస్తున్నారు. దీంతో వారంత దేశ భాష హిందీ నేర్చుకోవడానికి తెగ ఆరాట పడుతున్నారు. తమ జట్టులోని సహచర భారత ఆటగాళ్లతో కొందరు అలవోకగా హిందీ మాట్లాడుతుండాగా.. మరి కొద్దరు ఆ పదాలను పలకడానికి చాల కష్టపడుతున్నారు. అయితే టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ సహచర ఆటగాడై న్యూజిలాండ్ పేస్ బౌలర్ మిచెల్ మెక్‌గ్లాన్‌కు హిందీ పరీక్ష పెట్టాడు. ఐపీఎల్ సమయంలో తాను నేర్పించిన హిందీ గుర్తుకు ఉందా లేదా అని టెస్ట్ చేశాడు. ఈ వీడియోని సోషల్‌మీడియా వేదికగార రోహిత్ ‘మెక్‌గ్లాన్ హిందీని పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నా..’అని అభిమానులతో పంచుకున్నాడు.
ఇక మెక్‌గ్లాన్ ఈ వీడియోను రీట్విట్ చేస్తూ నా హిందీ ఎలా ఉంది ..? అని ప్రశ్నించాడు. దీనికి భారత అభిమానులు నీబౌలింగ్‌లా ఉంది అని కొందరు, మా ఇంగ్లీష్‌లా ఉందని మరికొందరు చలోక్తులు విసురుతున్నారు. అయితే ఆ వీడియోలో ఏముందంటే.. రోహిత్ హిందీలో నీకు తెలిసిన పదాలు చెప్పు అని మెక్‌గ్లాన్‌ను అడిగాడు. దీనికి మెక్ గ్లాన్ ఎక్కువ తెలియదు కానీ కొన్ని తెలుసు అని నవ్వుతూ తండా పానీ,నయ్‌నయ్ అనగా వాటిని రోహిత్ నవ్వుతూ ఇంగ్లీష్‌లో చెప్పాడు.
రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ మూడు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. ఈ గెలుపులో మెక్‌గ్లాన్ కీలకపాత్ర పోషించాడు. ఇక భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ ఈ నెల22న ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఆటగాళ్లు కలుసుకొని ఆదివారం సరదాగా గడిపారు.
మెక్‌గ్లాన్‌కు హిందీ నేర్పిన రోహిత్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment