శ్రీలంకలో అడుగుపెట్టిన రౌడీ హీరో.. ఆ సినిమా కోసమేనా? | Vijay Devarakonda Gets Grand Welcome In Srilanka | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: శ్రీలంకలో విజయ్ దేవరకొండ.. ఓ రేంజ్‌లో వెల్‌కమ్‌!

Published Tue, Jul 9 2024 11:00 AM | Last Updated on Tue, Jul 9 2024 12:01 PM

Vijay Devarakonda Gets Grand Welcome In Srilanka

ఈ ఏడాది ప్రారంభంలో ఫ్యామిలీ స్టార్‌తో అభిమానులను అలరించిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ. పరశురామ్ పెట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. అయితే విజయ్  మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్నారు. వర్కింగ్ టైటిల్‌ వీడి12 పేరుతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ శ్రీలంకలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడికి చేరుకున్న రౌడీ హీరోకు ఘనస్వాగతం లభించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన విజయ్ ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  కాగా.. విజయ్‌ దేవరకొండ- పరశురామ్‌ కాంబోలో మరో చిత్రం రానుంది. వీడీ13 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement