Aadi Sai Kumar Tees Maar Khan Movie Release Date Announced - Sakshi
Sakshi News home page

Tees Maar Khan: ఆది సాయికుమార్‌ తీస్‌మార్‌ ఖాన్‌ రిలీజ్‌ అయ్యేది ఆరోజే!

Published Fri, Jul 8 2022 6:54 PM | Last Updated on Fri, Jul 8 2022 7:38 PM

Aadi Sai Kumar Tees Maar Khan Gets Release Date - Sakshi

ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం 'తీస్ మార్ ఖాన్'. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. 

ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల రిలీజ్‌ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే! మనం ఆపాలనుకున్నంత పవర్ మన దగ్గరున్నా.. మనం ఆపలేనంత పవర్ వాడిదగ్గరుంది అనే డైలాగ్ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉండనుందో స్పష్టం చేసింది. స్టూడెంట్, రౌడీ, పోలీస్‌గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు.

చదవండి: మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో తన్నులు తినాలనుంది: అఖండ విలన్‌
నమ్మట్లేదా ? ఆధార్‌ కార్డు చూపించనా ?: యంగ్‌ హీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement