
Aadi Sai Kumar Athithi Devo Bhava Movie Thank You Meet: ‘‘మంచి చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ‘అతిథి దేవోభవ’ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే నాకు అభినందలు వస్తున్నాయి. కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని ఆది సాయికుమార్ అన్నారు. పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్, సువేక్ష జంటగా తెరకెక్కిన చిత్రం ‘అతిథి దేవోభవ’.
రాం సత్య నారాయణ రెడ్డి సమర్పణలో రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌లో ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి కలెక్షన్లు బాగున్నాయని రిపోర్ట్ వచ్చింది.
సెంటిమెంట్‌తో పాటు యాక్షన్, కామెడీ సన్నివేశాలను నాగేశ్వర్‌గారు బాగా తీశారు’’ అన్నారు. ‘‘మా సినిమా బాగుందని ప్రేక్షకులు చక్కని తీర్పు ఇచ్చారు’’ అన్నారు నాగేశ్వర్. ‘‘మా తొలి ప్రయత్నాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు నిర్మాతలు రాజాబాబు, అశోక్.