
పోలీసాఫీసర్‌గా తన ఇన్వెస్టిగేషన్ ఎలా సాగిందో ప్రేక్షకులకు చూపించేందుకు ఈ నెలలోనే గురి పెట్టారు ఆది సాయికుమార్. బి. కృష్ణ దర్శకత్వంలో ఆది సాయికుమార్, దర్శన బానిక్ జంటగా మహంకాళి దివాకర్ నిర్మించిన చిత్రం ‘బ్లాక్’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.
‘ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా ఆదిగారి నటన, కథ కొత్తగా ఉంటాయి. సినిమా ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఈ నెల మొదటివారంలో ట్రైలర్‌ను, 22న సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శంకర్.
Comments
Please login to add a commentAdd a comment