వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఇప్పుడు మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పలు యాక్షన్ సినిమాల ద్వారా మంచి విజయాలను అందుకోగా ఇప్పుడు ఈ సినిమా తో మరో విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలోని పాట విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన 'వెన్నెల వెన్నెల' పాటను ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు.
1st single #VennelaVennela Will be out on 25th ! @rameemusic @sidsriram @IRiyaSuman #TOPGEAR pic.twitter.com/5hDXnXQ8zb
— AadiSaikumar (@AadiSaikumar) November 21, 2022
Comments
Please login to add a commentAdd a comment