
ఒక బిల్డింగ్‌లో జరిగిన హత్య కేసును క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్‌ఐ) ఆఫీసర్ సనాతన్ ఎలా ఛేదించారు? అనే నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీఎస్‌ఐ సనాతన్’. ఆది సాయికుమార్, మిషా నారంగ్ జంటగా నటిస్తున్నారు. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో చాగంటి ప్రొడక్షన్‌లో అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. షూటింగ్ తుది దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జి.శేఖర్, సంగీతం: అనీష్ సోలోమాన్.
Comments
Please login to add a commentAdd a comment