Natakam Movie Director: Kalyanji Gogana Full Swing With Consecutive Movies - Sakshi
Sakshi News home page

Kalyanji Gogana- Aadi Sai Kumar: వరుస సినిమాలతో దూసుకుపోతున్న డైరెక్టర్‌

Feb 17 2022 2:27 PM | Updated on Feb 17 2022 3:33 PM

Natakam Director Kalyanji Gogana Full Swing With Consecutive Movies - Sakshi

అలా నిర్మాతలకు సపోర్టివ్‌గా సినిమాలను వేగంగా తెరకెక్కిస్తూ మంచి దర్శకుడిగా నిరూపించుకున్నారు కళ్యాణ్ జి గోగణ. ఆయన ప్రస్తుతం ఆది సాయి కుమార్ హీరోగా వస్తోన్న తీస్ మార్ ఖాన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు..

ఒక సినిమాను ఎంత త్వరగా ఫినిష్ చేశారు.. ఎంత క్వాలిటీగా తీశారు అనేది దర్శకుల ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. కొందరు సినిమాలను చాలా ఫాస్ట్‌గా తీసినా ఎంతో కొత్తగా ఉంటుంది. ఇంకొందరు సినిమాలను నెమ్మదిగా తీస్తుంటారు. కానీ కొత్త కథలను ఎంచుకుంటూ మేకింగ్ పరంగా కొత్తదనాన్ని చూపిస్తూ సినిమాను అతి వేగంగా పూర్తి చేయగల దర్శకులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో కళ్యాణ్ జి గోగణ ముందుంటారు.

నాటకం సినిమాతో కళ్యాణ్ జి గోగణ టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద తెరకెక్కిన ఈ సినిమాతో  కళ్యాణ్ జి గోగణకు మంచి పేరు వచ్చింది. మళ్లీ అదే బ్యానర్‌లో సుందరి అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన రూపొందించిన కాదల్, తీస్ మార్ ఖాన్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలా నిర్మాతలకు సపోర్టివ్‌గా సినిమాలను వేగంగా తెరకెక్కిస్తూ మంచి దర్శకుడిగా నిరూపించుకున్నారు కళ్యాణ్ జి గోగణ. ఆయన ప్రస్తుతం ఆది సాయి కుమార్ హీరోగా వస్తోన్న తీస్ మార్ ఖాన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తున్నారు.

సినిమా అవుట్ పుట్, దర్శకుడి పనితనం నచ్చిన నిర్మాత తిరుపతి రెడ్డి, హీరో ఆది మరొక సినిమాను కళ్యాణ్ జీ గోగణతో చేయబోతోన్నారు. తీస్ మార్ ఖాన్ సినిమా ఇంకా పూర్తి కాకముందే మరో చిత్రాన్ని కూడా ఓకే చేశారు. అలా నిర్మాత, హీరోలను మెప్పిస్తూ వేగంగా సినిమాలను తెరకెక్కిస్తూ మంచి విజన్ ఉన్న దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణ దూసుకుపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement