ఆది సాయికుమార్ టైటిల్ రోల్‌లో రూపొందిన చిత్రం ‘సీఎస్‌ఐ సనాతన్’. మిషా నారంగ్ హీరోయిన్. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో అజయ్ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 10న విడుదల కానుంది. ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేశారు.
కార్పొరేట్ లీడర్ విక్రమ్ చక్రవర్తి హత్యను చేధించడమే లక్ష్యంగా సీఎస్‌ఐ (క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్) సనాతన్ ఐదుగురు నిందితులను విచారించడం ఈ ట్రైలర్‌లో కనబడుతుంది. ఐదుగురూ ఐదు రకాలుగా చెబుతారు. ‘నిజాన్ని అస్సలు ఊహించలేము’ అని సనాతన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ సాగుతుంది. ‘‘మర్డర్ మిస్టరీగా రూపొందించిన ఈ చిత్రం ఉత్కంఠభరింతగా ఉంటుంది’’ అని నిర్మాత అజయ్ శ్రీనివాస్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment