
'మౌనపోరాటం', 'కర్తవ్యం', 'పంజరం', 'మామగారు', 'సీతారత్నంగారి అబ్బాయి' వంటి ఎన్నో సూపర్‌డూపర్ హిట్ చిత్రాలతో అలరించాడు సీనియర్ నటుడు వినోద్ కుమార్. తాజాగా ఓ టీవీ షోకు హాజరైన ఆయన తన వ్యక్తిగత, సినిమా విశేషాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ తర్వాత అంత భారీ ఆస్తులు మీకే ఉన్నాయటగా అన్న ప్రశ్నకు వినోద్ నోరెళ్లబెట్టాడు. ముకేశ్ అంబానీకి ఉన్నదాంట్లో 0.1% ఆస్తులున్నా ఇక్కడెందుకు ఉండేవాడిని? ఎప్పుడో లండన్‌లో స్థిరపడేవాడిని అని చెప్పుకొచ్చాడు.
కుర్ర వయసులో ఉన్నప్పుడు ఎందరినో ప్రేమించాను కానీ వారెవరూ తనను తిరిగి ప్రేమించకపోవడంతో చివరకు అరేంజ్‌డ్ మ్యారేజ్ చేసుకున్నానని తెలిపాడు. కర్తవ్యం సినిమాలో హీరో సాయి కుమార్ తనకు డబ్బింగ్ చెప్పకపోయేసరికి కొడదామనుకున్నానని సరదాగా చెప్పుకొచ్చాడు. ఒకసారి ఆమనితో రొమాంటిక్ సాండ్ డ్యాన్స్ షూటింగ్ చేస్తున్నామని, అది చూడలేక తన భార్య సెట్స్‌లో నుంచి వెళ్లిపోయిందని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు వినోద్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment