
రానా, త్రివిక్రమ్ లాంటి సెలబ్రెటీలతో సినిమాకు సంబంధించిన పోస్టర్స్, ఫస్ట లుక్స్ రిలీజ్ చేయించింది ఆపరేషన్ గోల్డ్‌ఫిష్ చిత్రయూనిట్. నేడు సూపర్‌స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేయించి.. బజ్ క్రియేట్ చేసింది. చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయి కుమార్ నటించిన ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాటల రచయిత అబ్బూరి రవి కీలకపాత్రలో నటిస్తుండగా.. ఎయిర్‌టెల్ భామ సాషా ఛెత్రి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని కాశ్మీర్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు కూడా ఈ సినిమాకు అనుకూలంగా ఉన్నాయి. హూ ఈజ్ ది గోల్డ్ ఫిష్ అంటూ ఆసక్తికరంగా మలిచిన ఈ టీజర్ అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. మొదటి సారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోన్న అబ్బూరి రవి, సాషా ఛెత్రిలకు ఈ సినిమా విజయాన్ని ఇస్తుందో లేదో చూడాలి. 'వినాయకుడు' ఫేమ్ సాయికిరణ్ అడివి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment