
తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన మలయాళ బ్యూటీ మిర్నా మీనన్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆది సాయికుమార్ హీరోగా ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ద్వారా మిర్నీ తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో ఆదికి జోడీగా ఇప్పటికే దిగంగనా సూర్యవంశీ ఎంపికయ్యారు. తాజాగా మరో హీరోయిన్‌గా మిర్నా మీనన్‌ను ఎంపిక చేశారు. ‘‘ఇద్దరి హీరోయిన్లకు తగిన ప్రాధాన్యత ఉంటుంది. వినోద ప్రదానంగా రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం ప్రముఖ తారాగణంపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment