కోవిడ్ తర్వాత ప్రేక్షకుల ఆలోచన మారింది. ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. వరల్డ్ సినిమా చూస్తున్నారు. ఇంటర్‌నేషనల్ కంటెంట్ దొరకుతుంది. వారి అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడం ఇప్పుడు దర్శక నిర్మాతలకు సవాల్‌గా మారింది’అని నిర్మాత కేకే. రాధామోహన్ అన్నారు. యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘క్రేజీ ఫెలో’. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రమిది. ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 14న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా కేకే.రాధామోహన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
► కోవిడ్ కారణంగా ఆగిన చిత్రాలు గత మూడు నెలలుగా వరుసగా విడుదలౌతున్నాయి. సెప్టెంబర్ లో విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ చాలా సినిమాలు వరుసలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో అక్టోబర్ 14 మంచి డేట్ అనిపించింది. అందుకే ఆ రోజు విడుదల చేస్తున్నాం. క్రేజీ ఫెలో మంచి వినోదం ఉన్న చిత్రం. ప్రేక్షకులు థియేటర్ కి వస్తారనే నమ్మకం ఉంది.
► క్రేజీ ఫెలో కథ చాలా బాగుంటుంది. నేను కథనే బలంగా నమ్ముతాను. బలమైన కథ ఇది. నూతన దర్శకుడు ఫణి కృష్ణ చెప్పినట్లే చక్కగా తీశారు. ఆదికి సరిపడే కథ ఇది. ఆది లుక్ డిఫరెంట్ గా ఫ్రెష్ గా ఉంటుంది. కథలో చాలా క్యూరియాసిటీ ఉంటుంది. చాలా క్లీన్ సినిమా. యూత్, ఫ్యామిలీ.. ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులు చూసి ఒక రెండున్నర గంటలు పాటు హాయిగా ఎంజాయ్ చేసే సినిమా క్రేజీ ఫెలో.
► ప్రస్తుతం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం సవాల్‌గా మారింది. ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్ కి వెళ్ళాలా ? ఓటీటీలో చూడాలా ? అని నిర్ణయించుకుంటున్నారు. ప్పుడు ప్రేక్షకులని ఆకట్టుకునే కంటెంట్ ఇవ్వడం దర్శక నిర్మాతలకు ఒక సవాల్‌గా మారింది.
► ఇప్పుడు ఇండస్ట్రీలో రెవెన్యూ ఆప్షన్స్ పెరిగాయి. శాటిలైట్, ఓటీటీ.. ఇలా రెవెన్యూ ఆప్షన్స్ పెరిగాయి. అయితే ఇందులో నిర్మాతకు మిగిలేది ఏమీ లేదు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఒక రోజు షూటింగ్‌కి రూ. 3 లక్షలు ఖర్చు అయితే ఇప్పుడు 8 లక్షలు అవుతుంది. మార్కెట్ ని అర్ధం చేసుకుంటూ కథకు తగిన వనరులు సమకూర్చుకుని నిర్మాణం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత నిర్మాతపైనే ఉంటుంది.
► ప్రస్తుతం ఆయుష్ శర్మ తో ఒక హిందీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ఫైనల్ చేశాం. త్వరలోనే వివరాలు తెలియజేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment