KK radha mohan
-
అది దర్శక నిర్మాతలకు ఒక సవాల్: కేకే.రాధామోహన్
కోవిడ్ తర్వాత ప్రేక్షకుల ఆలోచన మారింది. ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. వరల్డ్ సినిమా చూస్తున్నారు. ఇంటర్నేషనల్ కంటెంట్ దొరకుతుంది. వారి అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడం ఇప్పుడు దర్శక నిర్మాతలకు సవాల్‌గా మారింది’అని నిర్మాత కేకే. రాధామోహన్ అన్నారు. యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘క్రేజీ ఫెలో’. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రమిది. ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 14న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా కేకే.రాధామోహన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కోవిడ్ కారణంగా ఆగిన చిత్రాలు గత మూడు నెలలుగా వరుసగా విడుదలౌతున్నాయి. సెప్టెంబర్ లో విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ చాలా సినిమాలు వరుసలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో అక్టోబర్ 14 మంచి డేట్ అనిపించింది. అందుకే ఆ రోజు విడుదల చేస్తున్నాం. క్రేజీ ఫెలో మంచి వినోదం ఉన్న చిత్రం. ప్రేక్షకులు థియేటర్ కి వస్తారనే నమ్మకం ఉంది. ► క్రేజీ ఫెలో కథ చాలా బాగుంటుంది. నేను కథనే బలంగా నమ్ముతాను. బలమైన కథ ఇది. నూతన దర్శకుడు ఫణి కృష్ణ చెప్పినట్లే చక్కగా తీశారు. ఆదికి సరిపడే కథ ఇది. ఆది లుక్ డిఫరెంట్ గా ఫ్రెష్ గా ఉంటుంది. కథలో చాలా క్యూరియాసిటీ ఉంటుంది. చాలా క్లీన్ సినిమా. యూత్, ఫ్యామిలీ.. ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులు చూసి ఒక రెండున్నర గంటలు పాటు హాయిగా ఎంజాయ్ చేసే సినిమా క్రేజీ ఫెలో. ► ప్రస్తుతం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం సవాల్‌గా మారింది. ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్ కి వెళ్ళాలా ? ఓటీటీలో చూడాలా ? అని నిర్ణయించుకుంటున్నారు. ప్పుడు ప్రేక్షకులని ఆకట్టుకునే కంటెంట్ ఇవ్వడం దర్శక నిర్మాతలకు ఒక సవాల్‌గా మారింది. ► ఇప్పుడు ఇండస్ట్రీలో రెవెన్యూ ఆప్షన్స్ పెరిగాయి. శాటిలైట్, ఓటీటీ.. ఇలా రెవెన్యూ ఆప్షన్స్ పెరిగాయి. అయితే ఇందులో నిర్మాతకు మిగిలేది ఏమీ లేదు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఒక రోజు షూటింగ్‌కి రూ. 3 లక్షలు ఖర్చు అయితే ఇప్పుడు 8 లక్షలు అవుతుంది. మార్కెట్ ని అర్ధం చేసుకుంటూ కథకు తగిన వనరులు సమకూర్చుకుని నిర్మాణం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత నిర్మాతపైనే ఉంటుంది. ► ప్రస్తుతం ఆయుష్ శర్మ తో ఒక హిందీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ఫైనల్ చేశాం. త్వరలోనే వివరాలు తెలియజేస్తాం. -
అప్పుడు ఆవారా కార్తీ.. ఇప్పుడు ఖైదీ కార్తీ
‘‘ఖైదీ’ సినిమాని ఘనవిజయం చేసిన ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్. ఇంతకు ముందు నన్ను ‘ఆవారా’ కార్తీ అనేవారు.. ఇప్పుడు నేనెక్కడికి వెళ్లినా ‘ఖైదీ’ కార్తీ అని పిలుస్తుంటే థ్రిల్లింగ్‌గా ఉంది’’ అన్నారు కార్తీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్ ఈ నెల 25న విడుదల చేశారు. బుధవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో కార్తీ మాట్లాడుతూ– ‘‘ఆంధ్ర, తమిళనాడు, కేరళలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మా సినిమాకు మంచి స్పందన వస్తోంది. ‘ఖైదీ’లో ఢిల్లీ (కార్తీ పాత్ర పేరు)లాంటి పాత్ర నాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది. లోకేష్ రాసిన, తీసిన విధానం అద్భుతం. నాకు ఒక బామ్మ ఫోన్ చేసి, మంచి సినిమా, గొప్ప సినిమా చేశావని ప్రశంసించారు.. అదే నిజమైన సక్సెస్. ఈ కథను నా దగ్గరకు తీసుకువచ్చిన ఎస్.ఆర్. ప్రభుకు థ్యాంక్స్. ‘ఖైదీ’ టైటిల్ పెడితే సినిమా హిట్ అనే సెంటిమెంట్ మరోసారి వర్కవుట్ అయ్యింది. రవితేజగారు ఫోన్ చేసి, ‘ఇటువంటి సినిమా చేయాలనుకుంటున్నాను’ అని చెప్పారు. ‘ఖైదీ 2’ కూడా ఉంటుంది’’ అన్నారు. కేకే రాధామోహన్ మాట్లాడుతూ – ‘‘ఈ దీపావళికి ‘ఖైదీ’ వెలుగులు నింపింది. మా సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన వస్తోంది. కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ఈ సినిమా నిరూపించింది’’ అన్నారు. ‘‘ఖైదీ’కి భారీ సక్సెస్ అందించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు ఎస్.ఆర్. ప్రభు. -
ఖైదీ యాక్షన్
‘యుగానికొక్కడు, ఆవారా, నా పేరు శివ, ఊపిరి, ఖాకీ’ వంటి వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీ నటించిన తాజా చిత్రం ‘ఖైదీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ విడుదల చేస్తున్నారు. కార్తీ మాట్లాడుతూ– ‘‘సాంగ్స్, రొమాన్స్ లేకుండా కేవలం యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండే వైవిధ్యమైన చిత్రమిది. ఈ చిత్రాన్ని చూసి, ప్రేక్షకులందరూ థ్రిల్ అవుతారు’’ అన్నారు. కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉండే సినిమా ఇది. పాటలు, హీరోయిన్ లేకుండా డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో తండ్రి, కూతురి సెంటిమెంట్ బాగుంటుంది. కార్తీ సినిమాల్లోనే ‘ఖైదీ’ ఓ ప్రత్యేక సినిమా అవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సి.ఎస్., కెమెరా: సత్యన్ సూర్యన్. -
రాజ్ తరుణ్ హీరోగా ‘ఒరేయ్.. బుజ్జిగా’
ఏమైంది ఈవేళ, అధినేత, బెంగాల్ టైగర్, పంతం వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ మరో చిత్రాన్ని ప్రకటించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేమ్ కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో ఓ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఒరేయ్.. బుజ్జిగా’ అనే ఆసక్తికర టైటిల్‌ను నిర్ణయించినట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ, ‘ రాజ్ తరుణ్, కొండా విజయ్‌కుమార్ కాంబినేషన్ లో మా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం 8 ప్రారంభించాం. ఈ చిత్రానికి ‘ఒరేయ్.. బుజ్జిగా’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశాం. ఈ రోజు నుండి నాన్ స్టాప్‌గా షూటింగ్ జరుగుతుంది. మా బ్యానర్ లో ఒరేయ్.. బుజ్జిగా మరో మంచి హిట్ చిత్రం అవుతుంది’. అన్నారు. ఈ సినిమాలో హీరో రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తుండగా వాణి విశ్వనాధ్, నరేష్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 10 నుండి నిరవధికంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతమందిస్తున్నారు. -
దేశం పుట్టినప్పటి నుండి చెప్పుకునే కథే
-
కొట్టు.. కొట్టు.. కొబ్బరికాయ.. కార్తీక మాసంలోనే!
కమర్షియల్ సిన్మాలకు కరెక్టుగా సెట్టయ్యే కటౌట్... యాక్షన్ హీరోకి కావలసిన కొలతలు... అమ్మాయిల్ని ఆకట్టుకునే లుక్కులు... కథకు, క్యారెక్టర్‌కు తగ్గట్టు మౌల్డ్ అవ్వగల మ్యాచో మేన్... గోపీచంద్. ఈ కార్తీక మాసంలోనే ఆయన కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టనున్నారు. అంటే... నవంబర్‌లో సినిమా స్టార్ట్ కానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధా మోహన్ నిర్మించనున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు చక్రవర్తి (చక్రి) పరిచయం కానున్నారు. ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన ఎన్టీఆర్ ‘జై లవకుశ’కు చక్రి రచయిత (రైటర్)గా వర్క్ చేశారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సిన్మా చిత్రీకరణ డిసెంబర్లో మొదలవుతుంది. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో కె.కె. రాధామోహన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. -
నవ్వులే నవ్వులు!
‘అధినేత’,‘ ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ తదితర చిత్రాలను నిర్మించిన కేకే రాధామోహన్ తాజాగా నవీన్‌చంద్ర హీరోగా ఓ చిత్రం నిర్మించనున్నారు. ‘ఓ చినదాన’, ‘తిరుమల తిరుపతి వెంకటేశ’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ఇ.సత్తిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘పూర్తి వినోదాత్మక చిత్రమిది. ప్రేక్షకులకు వంద శాతం నవ్వులు పంచుతుంది. సత్తిబాబు ఈ కథను బాగా హ్యాండిల్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. నితిన్ హీరోగా భారీ చిత్రం ఇదే బ్యానర్లో నితిన్ హీరోగా రాధాకృష్ణ నిర్మించనున్న భారీ చిత్రం డిసెంబర్లో ప్రారంభమవుతుంది. -
ప్యార్ మే పడిపోయానే మూవీ స్టిల్స్