కొట్టు.. కొట్టు.. కొబ్బరికాయ.. కార్తీక మాసంలోనే! | KK Radhamohan and Chakravarthi film with Gopichand | Sakshi
Sakshi News home page

కొట్టు.. కొట్టు.. కొబ్బరికాయ.. కార్తీక మాసంలోనే!

Published Sat, Oct 28 2017 12:02 AM | Last Updated on Sat, Oct 28 2017 12:02 AM

KK Radhamohan and Chakravarthi film with Gopichand

కమర్షియల్‌ సిన్మాలకు కరెక్టుగా సెట్టయ్యే కటౌట్‌... యాక్షన్‌ హీరోకి కావలసిన కొలతలు... అమ్మాయిల్ని ఆకట్టుకునే లుక్కులు... కథకు, క్యారెక్టర్‌కు తగ్గట్టు మౌల్డ్‌ అవ్వగల మ్యాచో మేన్‌... గోపీచంద్‌. ఈ కార్తీక మాసంలోనే ఆయన కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టనున్నారు. అంటే... నవంబర్‌లో సినిమా స్టార్ట్‌ కానుంది.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె. రాధా మోహన్‌ నిర్మించనున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు చక్రవర్తి (చక్రి) పరిచయం కానున్నారు. ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’కు చక్రి రచయిత (రైటర్‌)గా వర్క్‌ చేశారు. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సిన్మా చిత్రీకరణ డిసెంబర్‌లో మొదలవుతుంది. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో కె.కె. రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement