
యంగ్ హీరో ఆది సాయికుమార్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన నాలుగైదు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. తాజాగా ఈ యువ హీరో మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టేశాడు. ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కబోతోంది. తెలుగులో ఇప్పటివరకు టచ్ చేయని ఓ వైవిద్యభరితమైన కథతో ఈ సినిమాను రూపొందించనున్నారు.
గురువారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment