
‘‘ఏడాదిన్నర క్రితం దర్శకుడు దేవ్ ‘సీఎస్‌ఐ సనాతన్’ కథ చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. సాధారణ పౌరులకు కనెక్ట్ అయ్యే కథ ఇది’’ అని ఆది సాయికుమార్ అన్నారు. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో ఆది సాయికుమార్, మిషా నారంగ్ జంటగా నటించిన చిత్రం ‘సీఎస్‌ఐ సనాతన్’. సునిత సమర్పణలో అజయ్ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఆది మాట్లాడుతూ– ‘‘మామూలుగా ఇలాంటి కథలు మలయాళంలో చూస్తుంటాం. తెలుగులో మా ‘సీఎస్‌ఐ సనాతన్’ మొదటిది అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నాను. ఇప్పటికే మన దేశంలో ఈ కథలోని ఘటనల్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది’’ అన్నారు శివశంకర్ దేవ్.
Comments
Please login to add a commentAdd a comment