
నిత్యా నరేశ్, ఆది సాయికుమార్
‘‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ చిత్రానికి కొన్ని వాస్తవిక సంఘటనలు తీసుకొని ఫిక్షనల్ పాయింట్స్ యాడ్ చేశాం. డైలాగ్స్ హార్డ్ హిట్టింగ్‌గా ఉంటాయి. కాశ్మీర్ సమస్యను పబ్లిసిటీ కోసం వాడుకోలేదు. కొత్త తరహా సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మా సినిమా కూడా నచ్చుతుంది’’ అని ఆది సాయికుమార్ అన్నారు. సాయికిరణ్ అడివి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’. ఆది సాయికుమార్, అబ్బూరి రవి, శషాచెట్రి, నిత్యా నరేశ్, కృష్ణుడు, పార్వతీశం, కార్తీక్ రాజు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు పనిచేసిన వారందరూ నిర్మాణంలో భాగస్వామ్యం వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నాగార్జున రిలీజ్ చేశారు. ‘‘బాగా పరిశోధన చేసి ఈ కథ రాశాం. ఈ ప్రయాణంలో అబ్బూరి రవి నాకు ఎమోషనల్ సపోర్ట్‌గా నిలబడ్డారు’’ అన్నారు సాయికిరణ్ అడివి. ‘‘ఈ చిత్రంలో నన్ను నటించమని సాయికిరణ్ నాలుగు నెలల పాటు తిరిగాడు. నేను యాక్టర్‌ని కాదు రైటర్‌ని అంటూ తనకి కనబడకుండా తప్పించుకు తిరిగినా, ఫైనల్‌గా నటించా. నటుడిగా సరిపోయానా? లేదా? అనేది ప్రేక్షకులు చెప్పాలి’’ అన్నారు మాటల రచయిత అబ్బూరి రవి. పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, కార్తీక్ రాజు, నిత్యా నరేశ్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment