ప్యాన్‌ ఇండియా మూవీ సిరీస్‌లో... | Aadi Saikumar to do a Pan India movie next | Sakshi
Sakshi News home page

ప్యాన్‌ ఇండియా మూవీ సిరీస్‌లో...

Published Sat, Jul 11 2020 1:22 AM | Last Updated on Sat, Jul 11 2020 6:34 AM

Aadi Saikumar to do a Pan India movie next - Sakshi

ఆదీ సాయికుమార్

ఆదీ సాయికుమార్‌ హీరోగా ఓ ప్యాన్‌ ఇండియా మూవీ రూపొందనుంది. ఈ చిత్రంతో బాలవీర్‌. యస్‌ దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. యస్‌.వి.ఆర్‌ ప్రొడక్షన్ పతాకంపై యస్‌.వి.ఆర్‌ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇన్వెస్టిగేటివ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. ఇందులో ఫ్యాంటసీ ఎలిమెంట్స్, వీఎఫ్‌ఎక్స్‌లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆదీ సాయికుమార్‌ చేసిన గత చిత్రాలకు భిన్నంగా కామిక్‌ టచ్‌తో సాగే చిత్రమిది. రెండేళ్ల పాటు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌పై దృష్టి పెట్టాం. ఈ చిత్రాన్ని ఒక సిరీస్‌లా చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఈ సిరీస్‌లో చాప్టర్‌ 1 త్వరలోనే ప్రారంభం కానుంది. ఆదికి ఈ సినిమా పెద్ద బ్రేక్‌ అవుతుందని భావిస్తున్నాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement