List Of Upcoming Movie Releases In OTT And Theatres This Week October 2nd Week - Sakshi
Sakshi News home page

OTTAnd Theatres Releases: ఈ వారం థియేటర్స్‌, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే..!

Published Tue, Oct 11 2022 2:02 PM | Last Updated on Tue, Oct 11 2022 6:02 PM

OTT And Theatres Release Movies In October 2nd Week - Sakshi

దసరా పండుగ సందర్భంగా గతవారం ‘గాడ్‌ ఫాదర్‌’, ‘ది ఘోస్ట్‌’, ‘స్వాతిముత్యం’ వంటి చిత్రాలు థియేటర్లో సందడి చేశాయి. ఇందులో గాడ్‌ ఫాదర్‌ బ్లాక్‌బాస్టర్‌ విజయం సాధించగా ది ఘోస్ట్‌, స్వాతిముత్యం చిత్రాలు యావరేజ్‌గా నిలిచాయి. గత వారం పెద్ద చిత్రాలు ఉండటం చిన్న సినిమాలు ఈ వారం థియేటర్లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. మరి అందులో ఏ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి. అలాగే ఓటీటీలో కూడా పలు పెద్ద సినిమా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీస్‌ అలరించబోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీ, థియేటర్లోకి వచ్చే చిత్రాలేవో ఓసారి చూద్దాం! 

                                                                              థియేటర్లో విడుదల కాబోయే వచ్చే సినిమాలు

ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆది సాయికుమార్‌ ఇప్పుడు ‘క్రేజీ ఫెలో’ చిత్రంతో రాబోతున్నాడు. దర్శకుడు ఫణికృష్ణ సిరికి తెరకెక్కించిన ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ అక్టోబర్‌ 14న విడుదల కానుంది. దిగంగన సూర్యవంశీ, మిర్నా మేనన్‌ హీరోయిన్లుగా నటించారు. 

‘కేరింత’ ఫేం విశ్వంత్, మాళవిక సతీషన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’. సరికొత్త కథాంశంతో దర్శకుడు కంభంపాటి రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.

‘కేజీయఫ్‌’ సిరీస్‌ చిత్రాలతో విశేష ప్రేక్షకాదరణ పొందిన కన్నడ నటుడు యశ్‌. ఆ క్రేజ్‌ను దృష్టిని పెట్టుకొని పలువురు నిర్మాతలు యశ్‌ గతంలో నటించిన సినిమాలను తెలుగులో డబ్‌ చేస్తున్నారు. అలా.. ‘సంతు.. స్ట్రయిట్‌ ఫార్వార్డ్‌’ అనే సినిమా ‘రారాజు’గా తెలుగు ప్రేక్షకులను అందిస్తున్నారు. ఆయన భార్య రాధిక పండిట్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అక్టోబర్‌ 14న థియేటర్లో సందడి చేయబోతుంది. మహేశ్‌ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడ (2016)లో విడుదలై మంచి విజయం అందుకుంది.

కన్నడ దర్శక-నిర్మాత, నటుడు రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతారా’. సెప్టెంబరు 30న కన్నడనాట  విడుదలైన ఈ సినిమా రికార్డు సృష్టించింది. దాంతో చిత్ర బృందం ఈ సినిమాని ఇతర భాషల్లోనూ విడుదల చేసేందుకు సిద్ధమైంది. అలా తెలుగులో కంతారాగా ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం అక్టోబర్‌ 15న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నటుడు సునీల్‌, హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గీతా. దర్శుడకు విశ్వా రావ్‌ రూపొందించిన ఈ మూవీకి రచ్చయ్య నిర్మాతగా వ్యవహరించారు. ప్రముక కమెడియన్‌ సప్తగిరి, పృథ్వీలు కీ రోల్‌ పోషించిన ఈ సినిమా ఈ నెల 14న థియేటర్లో విడుదల కానుంది. 

బెక్కం వేణుగోపాల్‌ సమర్పణలో ఎస్‌ఎల్‌ఎస్‌ మూవీస్‌ నిర్మాణ సంస్థలో రంజిత్‌, సౌమ్య మీనన్‌ హీరో హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం లెహరాయి. రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో రూపొందిన  చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందకు రాబోతోంది. సీనియర్‌ నటి ఇంద్రజ, సాయికుమార్‌లు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను మద్దిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మించాడు.

                                                         ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు

నెట్‌ఫ్లిక్స్‌

ది ప్లే లిస్ట్ (అక్టోబరు 13)

మిస్‌ మ్యాచ్చ్డ్‌ (Miss matched) హీందీ (అక్టోబర్‌ 14)

తాప్సీ దోబారా (అక్టోబర్‌ 15)

సోనీ లివ్

ఈషో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)

గుడ్‌ బ్యాడ్‌ గర్ల్‌ (Good bad girl) (అక్టోబర్‌ 14)

అమెజాన్‌ ప్రైమ్‌

ది రింగ్స్ ఆఫ్ పవర్: ఫైనల్  (అక్టోబర్‌ 14)

నేను మీకు బాగా కావాల్సిన వాడిని (అక్టోబర్‌ 14)

డిస్నీ+హాట్‌స్టార్‌

ఆషికానా సీజన్‌ 2

హౌజ్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ 8th ఎపిసోడ్‌( House of the dragon 8th episode)

షి హల్క్‌ 

డిస్కవరీ ప్లస్(Discovery+):

ది జర్నీ ఆఫ్ ఇండియా(స్ట్రీమింగ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement