‘శంబాల’ కోసం జియో సైంటిస్ట్‌గా మారారు ఆది సాయి కుమార్. ఆయన హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల’. అర్చనా అయ్యర్ హీరోయిన్ . యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ పతాకంపై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా సోమవారం (డిసెంబరు 23) ఆది బర్త్ డే. ఈ సందర్భంగా ‘శంబాల’ నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
‘‘ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్‌తో ఈ మూవీ తీస్తున్నాం. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొందిన యుగంధర్ ముని ఈ సినిమాని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హన్్స జిమ్మర్‌తో పని చేసిన శ్రీరామ్ మద్దూరి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు’’అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీలో శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment