
‘‘త్రిముఖ’ చిత్ర దర్శకుడు రాజేష్ నాయుడు నాకెప్పటి నుంచో తెలుసు. ఆయన తీసిన ఈ సినిమా మోషన్ పోస్టర్‌ని నేను విడుదల చేయటం హ్యాపీగా ఉంది. హీరో యోగేష్ మంచి పట్టుదల ఉన్న వ్యక్తి. మంచి కథతో ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కొత్త ఒరవడి సృష్టిస్తుంది’’ అని హీరో సాయిదుర్గా తేజ్ అన్నారు.
యోగేష్, ఆకృతి అగర్వాల్ జంటగా రాజేష్ నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం ‘త్రిముఖ’. నాజర్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కృష్ణమోహన్, శ్రీవల్లి సమర్పణలో శ్రీదేవి మద్దాలి, హర్ష కల్లె నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను సాయిదుర్గా తేజ్ ఆవిష్కరించారు. ‘‘ఉత్కంఠభరితమైన సబ్జెక్ట్‌తో రూపొందిన ఈ సినిమాలో మంచి నటన కనబరిచే చాన్స్ దక్కింది’’ అని యోగేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment