థియేటర్లోనే ప్రేమకథ | Nagachaitanya Love Story Poster Release | Sakshi
Sakshi News home page

థియేటర్లోనే ప్రేమకథ

Published Sun, Aug 30 2020 2:39 AM | Last Updated on Sun, Aug 30 2020 2:39 AM

Nagachaitanya Love Story Poster Release - Sakshi

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లవ్‌ స్టోరీ’. ఎమిగోస్‌  క్రియేష¯Œ్స, సోనాలి నారంగ్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్‌ దాస్‌ కె.నారంగ్, పి.రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. శనివారం నాగార్జున బర్త్‌ డే సందర్భంగా ‘లవ్‌ స్టోరీ’ మేకర్స్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా నుండి ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ‘‘15 రోజులు  షూటింగ్‌ మినహా సినిమా పూర్తయింది. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టాక షూటింVŠ  ప్రారంభిస్తాం. సరైన సమయంలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాత: భాస్కర్‌ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఐర్ల నాగేశ్వర రావు.

చైతన్య–విక్రమ్‌ల థ్యాంక్యూ
నాగచైతన్య హీరోగా తెరకెక్కనున ్న 20వ చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్, హర్షిత్‌ రెడ్డి నిర్మించనున్నారు. ‘‘చైతు, విక్రమ్‌ కాంబినేష¯Œ లో వచ్చిన క్లాసిక్‌ మూవీ ‘మనం’ ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా చేయనుండటం ఆనందంగా ఉంది’’ అని నిర్మాతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement