Naga Chaitanya and Sai Pallavi's 'Love Story' Movie Teaser Releasing on September 20 - Sakshi
Sakshi News home page

ప్రేమతో ఓ బహుమతి

Published Tue, Sep 15 2020 6:46 AM | Last Updated on Tue, Sep 15 2020 3:57 PM

Nagachaitanya Love Story teaser on September 20 - Sakshi

నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్‌స్టోరీ’. కరోనా బ్రేక్‌ తర్వాత ఇటీవలే మళ్లీ చిత్రీకరణ  ప్రారంభం అయింది. ఈ చిత్రబృందం చైతన్య అభిమానులకు ఓ బహుమతి ప్లాన్‌ చేసిందని సమాచారం. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. నారాయణ్‌ దాస్‌ నార ంగ్‌ నిర్మాత. ఈ నెల 20న దివంగత నటులు, నాగచైతన్య తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఓ టీజర్‌ను ఆ రోజు విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ‘లవ్‌స్టోరీ’ను పూర్తి చేస్తున్నారు. మరో వారం రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తెలంగాణ యాసలో సంభాషణలు పలకనున్నారు. ఈ చిత్రానికి పవన్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement