RGV Launches Oka Pathakam Prakaram Movie Poster: సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా నటించిన సినిమా 'ఒక పథకం ప్రకారం'. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైంది. వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ పనిచేస్తున్నారు.దర్శకుడు వినోద్ విజయన్, ఎడిటిర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ సహా మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు ఒక పథకం ప్రకారం సినిమా కోసం పని చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment