బోనాల పండగ జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తమన్నా కూడా బోనం ఎత్తారు. అయితే ఆమె పండగ చేసుకుంటున్నది ‘ఓదెల 2’ చిత్రం కోసం. తమన్నా లీడ్ రోల్‌లో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్న చిత్రం ఇది. దర్శకుడు సంపత్ నంది సూపర్‌విజన్‌లో ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021) సినిమాకి సీక్వెల్‌గా అశోక్ తేజ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ బహు భాషా చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
భారీ మల్లన్న టెంపుల్ సెట్‌లో క్లైమాక్స్‌ని చిత్రీకరిస్తున్నారు. తమన్నా, ఇతర నటీనటులతోపాటు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు షూటింగ్‌లోపాల్గొంటున్నారు. బోనాల సంబరాల నేపథ్యంలో సాగే ఎపిసోడ్ ఇది. ఈ సన్నివేశాల్లోని తమన్నా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమాలోనిపాత్ర కోసం తమన్నా శిక్షణ తీసుకున్నారు. యాక్షన్ సన్నివేశాలను ఆమె అద్భు తంగా చేస్తున్నారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహ, యువ, నాగమహేశ్, వంశీ, గగన్ విహారి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: సౌందర్‌రాజన్.
Comments
Please login to add a commentAdd a comment