Daari Movie Concept Poster Released - Sakshi
Sakshi News home page

సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ 'దారి' కాన్సెప్ట్ పోస్టర్ విడుదల

Published Tue, Feb 8 2022 4:07 PM | Last Updated on Tue, Feb 8 2022 4:38 PM

Daari Movie Concept Poster Released - Sakshi

కంటెంట్ బేస్డ్ సినిమాలకు దక్కుతున్న ఆదరణ ఎంతోమంది నూతన దర్శకనిర్మాతలకు బలాన్నిస్తోంది. దీంతో కొత్త కథలను రాసుకొని వాటిని ప్రేక్షకుల మెప్పు పొందేలా రూపొందిస్తున్నారు. ఇదే బాటలో రాబోతున్న విలక్షణ సినిమా 'దారి'. సుహాష్ బాబు ఈ చిత్రానికి ఇదర్శకత్వం వహిస్తుండగా ఫిఫ్త్ హౌస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నరేష్ మామిళ్ళ, మోహన్ ముత్తిరయిల్ నిర్మిస్తున్నారు.

పరమేశ్వర్ హివ్రాలే, కళ్యాణ్ విట్టపు, సునీత సద్గురు, సాయి తేజ గోనుగుంట్ల, అభిరామ్ (క్రేజీ అభి) ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌,ఇతర అప్‌డేట్స్‌ ఇవ్వనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement