
తమిళ యువ హీరోలందరిలో సూర్య సినిమాలకు టాలీవుడ్‌లో కూడా క్రేజ్. సూర్య తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన కార్తీ కొద్ది రోజుల్లోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఊపిరి సినిమాలో కింగ్ నాగ్‌తో కలిసి నటించి, మంచి మార్కులు కొట్టేశాడు.
ఖాకీ సినిమాతో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్న కార్తీ తాజా చిత్రానికి సంబంధించి మే డే కానుకగా పోస్టర్‌లను విడుదల చేశారు. తలకు పాగా చుట్టుకుని, అద్దాలు పెట్టుకుని మాస్ లుక్కులో ఉన్నాడు. బైక్ నంబర్ ప్లేట్‌పై ఫార్మర్ అని కూడా ఉంది. అలాగే కూలీలందరితో కార్తీ కూర్చొని ఉన్న మరొక ఫోటోను కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోస్టర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా రైతుకు సంబంధించిన కథే అని తెలుస్తోంది. ఇక కార్తీకి జోడిగా అఖిల్ ఫేం సాయేషా నటిస్తోంది. ఈ సినిమాకు ఇమ్మాన్ సంగీతం సమకూర్చగా, పాండ్యరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, రవీందర్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment