వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈసినిమాకు మేర్లపాక గాంధీ దర్శకుడు. ఈ సినిమాలో నాని సరసన అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈసినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో తాజాగా టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.
కృష్ణార్జున యుద్ధం సినిమా టీజర్‌ను మార్చి 10న ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా హీరో నాని సోషల్ మీడియాలో ప్రకటించాడు. ‘కృష్ణార్జున యుద్ధం శాంపిల్ ఒకటి వదులుతున్నాం’ అంటూ టీజర్ రిలీజ్ పోస్టర్‌ను ట్వీట్ చేశాడు నాని. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈసినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Krishnarjuna yudham sample okati vadhulthunnam :))
— Nani (@NameisNani) 8 March 2018
తేది : మార్చ్ 10
ముహూర్తం : ఉదయం 10 గంటలకు#KAYTeaserOn10th pic.twitter.com/GTKCeehipB
Comments
Please login to add a commentAdd a comment