నేనెప్పుడూ అందుకు సిద్ధంగానే ఉంటా | nani krishnarjuna yuddham special | Sakshi
Sakshi News home page

నేనెప్పుడూ అందుకు సిద్ధంగానే ఉంటా

Published Wed, Apr 11 2018 12:30 AM | Last Updated on Wed, Apr 11 2018 9:03 AM

nani krishnarjuna yuddham special - Sakshi

నాని

‘‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో మంచి కామెడీ, ఎమోషన్, రొమాన్స్‌.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో యంగ్‌ కమెడియన్స్‌ చేసిన ఫన్‌ అందరికీ నచ్చుతుంది. ఈ వేసవిలో ఈ సినిమా నాకు మంచి సక్సెస్‌ ఇస్తుందనే నమ్మకంగా ఉన్నా’’ అని నాని అన్నారు. ఆయన హీరోగా,  అనుపమా పరమేశ్వరన్, రుక్సార్‌ మీర్‌ హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని పంచుకున్న చిత్ర విశేషాలు..

►నేను గతంలో ‘జెండాపై కపిరాజు, జెంటిల్‌మన్‌’ చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశాను. ఆ రెండు సినిమాల్లో ఒకపాత్రకి మరోపాత్ర కనెక్ట్‌ అయ్యుంటుంది. కానీ, ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో రెండు పాత్రలకి అస్సలు సంబంధం ఉండదు. ఎవరి సమస్యలతో వాళ్లు పోరాడుతుంటారు. అలాంటి ఇద్దరూ కథలో ఎలా కలుసుకున్నారు? అన్నదే మా చిత్రం. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 

►కృష్ణ, అర్జున్‌ పాత్రల్లో నాకు కృష్ణ పాత్ర చాలా బాగా నచ్చింది. ఆ పాత్రలోనే ఎక్కువ వినోదం ఉంటుంది. కృష్ణ పాత్ర కొద్దిగా ఛాలెంజింగ్‌గా అనిపించింది. చిత్తూరు యాసలో మాట్లాడటానికి మొదట్లో రెండు రోజులు కొంత ఇబ్బందిపడ్డా. మా డైరెక్టర్‌ గాంధీ సహాయంతో ఆ తర్వాత అన్నీ సెట్‌ అయ్యాయి.  

► స్టార్‌ స్టేటస్‌ను చాలా హ్యాపీగా ఫీలవుతున్నా. ప్రతిసారీ మన జడ్జిమెంట్‌ కరెక్ట్‌గా ఉండదు. ఒక్కోసారి తప్పొచ్చు. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా. 

► ‘అ’ సినిమా విజయం నాకు పెద్ద మోటివ్‌. ఇకపైనా అలాంటి వైవిధ్యమైన సినిమాలు నిర్మిస్తాను. నాకు అన్నీ ఇచ్చిన ఇండస్ట్రీకి కొత్త దర్శకుల్ని పరిచయం చేసేందుకు  నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటా. కొందరు కొత్త కథలతో సంప్రదిస్తున్నారు. 

►నా సినిమా ఎంత బిజినెస్‌ చేస్తుందనే లెక్కలు నాకు తెలియవు. ఈ సమ్మర్‌లో కమర్షియల్‌ సినిమాను ఎంజాయ్‌ చేయాలనుకునే ప్రేక్షకులకు ‘కృష్ణార్జున యుద్ధం’ మంచి సినిమా. తర్వాత వారం ‘భరత్‌ అనే నేను’ విడుదలవుతుంది. ఆ సినిమా కోసం నేను కూడా వెయిట్‌ చేస్తున్నా. ‘రంగస్థలం’ సక్సెస్‌ కావడం చాలా సంతోషంగా ఉంది. ‘భరత్‌ అనే నేను’ కూడా పెద్ద సక్సెస్‌ కావాలి. 

► శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునగారు, నేను ఓ మల్టీస్టారర్‌ మూవీ చేస్తున్నాం. ఓ పాట కోసం వారం పాటు షూటింగ్‌ చేశాం. నాగార్జునగారితో నటించడం చాలా ఎగ్జయిటింగ్‌గా, సంతోషంగా ఉంది. ‘బిగ్‌బాస్‌ 2’ ఎవరు హోస్ట్‌ చేస్తారో ఛానల్‌ వాళ్లే ప్రకటిస్తారు. 

►కొరటాల శివగారితో నేను సినిమా చేస్తున్నానన్నది రూమర్‌. ఇప్పుడప్పుడే ఆయనతో సినిమా చేసే వీలుండదు. ప్రస్తుతం నాగార్జునగారితో మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్నా.  5 సినిమాలు స్క్రిప్ట్‌ దశలో ఉన్నాయి. ఏది ముందు స్టార్ట్‌ అవుతుందో చెప్పలే ను. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement