
నాని ఎక్స్‌ప్రెస్!
దర్శకుడు మేర్లపాక గాంధీ తీసిన రెండు సినిమాల టైటిల్స్‌లో ఎక్స్‌ప్రెస్ ఉంది. రిలీజైన తర్వాత హిట్ టాక్ సొంతం చేసుకోవడంలోనూ, మంచి కలెక్షన్స్ సాధించడంలోనూ రెండు సినిమాలు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ స్పీడును చూపించాయి. కానీ, దర్శకుడిగా గాంధీ ప్రయాణంలో ఆ స్పీడు కనిపించదు. సినిమాకు, సినిమాకు మధ్య ఆయన ఎక్కువ గ్యాప్ తీసుకుంటారు.
గతేడాది సంక్రాంతికి గాంధీ రెండో సినిమా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ విడుదలైతే... ఇప్పుడు త్వరలో మూడో సినిమా కబురు బయటకు రానుంది. వరుస విజయాలతో ఎక్స్‌ప్రెస్ వేగంతో సినిమాలు చేస్తున్న నాని హీరోగా మేర్లపాక గాంధీ ఓ సినిమా తీయనున్నారని టాక్. ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభం కానుందట! నాని కామెడీ టైమింగ్, యాక్టింగ్, స్టోరీ సెలక్షన్ గురించి స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. కథలో కమర్షియల్ హంగులు మిస్ కాకుండా కామెడీతో కితకితలు పెట్టడం గాంధీ సై్టల్. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే సూపర్ స్టోరీ కమ్ కామెడీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు!!