హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మజిలీ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం సీనియర్ హీరో వెంకటేష్‌తో కలిసి వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా లైన్‌లో పెడుతున్నాడు చైతూ. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు నాగచైతన్య ఓకె చెప్పాడు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడట.
అంతేకాదు బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ నాగచైతన్య కోసం ఓ ప్రేమకథను రెడీ చేస్తున్నాడట. ఈ సినిమా దేవదాసుకు మోడ్రన్ వర్షన్ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. కథా కథనాలు ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా సాగినా క్లైమాక్స్ మాత్రం దేవదాసు తరహాలోనే విషాదాంతమే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment