Nithin 30 Movie: Nithin, Nabha Natesh Upcoming Movie | Nithin 30 Movie Release Date - Sakshi
Sakshi News home page

విలక్షణ పాత్రలో... 

Published Sat, Feb 20 2021 8:17 AM | Last Updated on Sat, Feb 20 2021 11:45 AM

Nithiin And Merlapaka Gandhi New Movie To hit The Theatre On Jan 11 - Sakshi

నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై ఎన్‌. సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, తమన్నా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇంకా టైటిల్‌ నిర్ణయించని ఈ సినిమాని జూన్‌ 11న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘నితిన్‌ హీరోగా నటిస్తున్న 30వ చిత్రమిది. ఇప్పటి వరకూ నటించని విలక్షణ పాత్రలో నటిస్తున్నారు నితిన్‌. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కీలకమైన ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని ప్రధాన తారాగణమంతా పాల్గొంటోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల, సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: జె. యువరాజ్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement