నితిన్‌ 30వ సినిమా షూటింగ్ షురూ | Nithin 30th Movie Shooting Start Under Merlapaka Gandhi | Sakshi
Sakshi News home page

నితిన్‌ 30వ సినిమా షూటింగ్ షురూ

Published Sun, Dec 6 2020 9:58 PM | Last Updated on Sun, Dec 6 2020 10:05 PM

Nithin 30th Movie Shooting Start Under Merlapaka Gandhi - Sakshi

యూత్ స్టార్ నితిన్ హీరోగా మెర్లపాకా గాంధీ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ ఆదివారం నుంచి దుబాయ్ లో షూటింగ్ జరుగుతోంది. నితిన్- నభా నటేష్ జంటపై సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. నితిన్‌కి ఇది 30 వ సినిమా. ఈ మూవీ ప్రారంభోత్సవం గురించి నితిన్ స్వయంగా వెల్లడిస్తూ ఒక లైవ్ ఫోటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. బాలీవుడ్ లో సూప‌ర్ హిట్‌గా నిలిచిన ‘అంధాదున్’ సినిమాకి రీమేక్ ఇది. 
(చదవండి : ప్రభాస్‌ మూవీపై కామెంట్‌.. సారీ చెప్పిన సైఫ్‌ అలీఖాన్‌)

నితిన్ షేర్ చేసిన ఫొటోలో ఆయ‌న‌ ష‌ర్టుపై స్వెట‌ర్ వేసుకొని పియానో ప్లే చేస్తూ క‌నిపిస్తున్నారు. ఈ మూవీలో త‌మ‌న్నా భాటియా ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు. జ‌న‌వ‌రి నుంచి జ‌రిగే త‌దుప‌రి షెడ్యూల్ షూటింగ్‌లో ఆమె పాల్గొన‌నున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాను ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. మ‌హ‌తి స్వర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి హ‌రి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఇక నితిన్, కీర్తి సురేష్ నటించిన ‘రంగ్ దే’ షూటింగ్ త్వరలోనే పూర్తి కాబోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement