Devara X Reveiw: ‘దేవర’కు ఊహించని టాక్‌.. మైనస్‌ ఏంటంటే..? | Jr NTR Devara 2024 Movie Twitter Review In Telugu, Check Tweets Inside | Sakshi
Sakshi News home page

Devara Movie Twitter Reveiw: ‘దేవర’కు ఊహించని టాక్‌.. మైనస్‌ ఏంటంటే..?

Published Fri, Sep 27 2024 6:59 AM | Last Updated on Fri, Sep 27 2024 9:09 AM

Devara Movie Public Talk And Twitter Review

 ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఎన్నాళ్లుగాను ఎదురు చూస్తున్న  దేవర మూవీ ఎట్టకేల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఎన్టీఆర్‌ నటించిన చిత్రం కావడం.. జనతా గ్యారేజ్‌తో సూపర్‌ హిట్‌ అందించిన కొరటాల శివ దర్శకత్వం వహించడంతో ‘దేవర’పై ముందు నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్‌, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక పాన్‌ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్స్‌ చేయడంతో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ దేవరపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్‌ 27) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురువారం అర్థ రాత్రి నుంచి స్పెషల్‌ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. దేవర ఎలా ఉంది? ఎన్టీఆర్‌ ఖాతాలో మరో హిట్‌ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇవి కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు. 

ఎక్స్‌లో ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది.  యావరేజ్‌ సినిమా అని కొంతమంది అంటుంటే... బ్లాక్‌ బస్టర్‌ మూవీ అని మరికొంతమంది కామంట్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ యాక్టింగ్‌పై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. రెండు పాత్రల్లో అద్భుతంగా నటించారని చెబతున్నారు. అనిరుధ్‌ నేపథ్య సంగీతం బాగుందని కామెంట్‌ చేస్తున్నారు.  కథలో కొత్తదనం లేదని, సెకండాఫ్‌ సాగదీతగా అనిపిస్తుందని కొంతమంది నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement