ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘దేవర’. జనతా గ్యారేజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్‌తో కొరటాల శివ చేస్తున్న రెండో సినిమా ఇది. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ కొరటాల శివ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. టెన్షన్ పడుతున్నారా?
కొద్దిపాటి టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ రోజు స్టూడెంట్ ఎలా టెన్షన్ పడతాడు. అలా కొద్దిపాటి టెన్షన్ అయితే ఉంది.
‘దేవర’ రియల్ స్టోరీనా? లేదా ఫిక్షనల్ స్టోరీనా?
కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ.
ఈ సినిమాలో ధైర్యం కంటే ఎక్కువగా భయాన్ని చూపించినట్లు ఉన్నారు?
మనిషికి ధైర్యం అవసరం. కానీ మితిమీరిన ధైర్యం మంచి కాదు. అది ముర్ఖత్వం అవుతుంది. మనకు తెలియకుండా మనలో చిన్నపాటి భయం ఉంటుంది. దాన్ని గౌరవించాలి. అది అందరికి మంచింది. మనకు ఇచ్చిన పని మనం ఎలా చేస్తున్నామనేది చెక్ చేసుకోవడమే భయం. అదే ఈ సినిమాలో చూపించాం.
ఎన్టీఆర్‌కు ఈ కథ చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? ఎలాంటి సపోర్ట్ అందించాడు?
ఎన్టీఆర్‌తో నాకు మంచి బాండింగ్ ఉంది. ఆయన రియాక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. బాలేకపోతే..బాలేదని డైరెక్ట్‌గా మొహం మీదే చెబుతాడు. ఒకవేళ బాగుంటే.. ఆ విషయాన్ని కూడా చాలా స్ట్రాంగ్‌గా చెబుతాడు. మనిషికి భయం ఉండాలి అనే పాయింట్‌కి ఎన్టీఆర్ ఫిదా అయ్యాడు. వెంటనే ఒకే చెప్పడంతో కథను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాం.
దేవర కంటే ముందు అల్లు అర్జున్‌తో ఒక సినిమా అనౌన్స్ చేశారు. అది ఈ కథేనా?
దేవర కథకు దానికి ఎలాంటి సంబంధం లేదు. అది సెపరేట్ స్టోరీ.
‘ఆచార్య’ ఫలితం చూసిన తర్వాత ఈ కథలో ఏమైన మార్పులు చేశారా?
చాలా మార్పులు చేశాం. ముందు పరీక్ష సరిగ్గా రాయకపోతే తర్వాతి పరీక్షను బాగా రాయాలనుకుంటాం కదా? ఇదీ అంతే. ఆచార్య సినిమా ఒత్తిడి నాపై పెద్దగా పడలేదు. ఆ సినిమా రిలీజ్ అయిన 20 రోజులకే నేను ‘దేవర’సినిమా పనులను ప్రారంభించాను.
మీ ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది కదా? ఇందులో కూడా మంచి సందేశం ఉందా?
మనం తీసుకుంటే మెసేజ్.. లేదంటే లేదు. ‘మనిషికి భయం ఉండాలి’అని ఈ కథలో చెప్పాం. దాన్ని సందేశం అనుకుంటే అనుకోవచ్చు.
దేవరను రెండు భాగాలు తీయాలని ఎప్పుడు అనుకున్నారు?
ఈ కథ నెరేషనే 4 గంటలు ఉంది. మూడు గంటల్లో ఈ కథను చెప్పగలమా అని ఆలోచించాం. రెండో షెడ్యూల్ అప్పుడే ఇది సాధ్యం కాదని మాకు అర్థమైపోయింది. అప్పుడే రెండు భాగాలుగా సినిమాను రిలీజ్ చేయాలని భావించాం. ఈ సినిమాకు మూడు, నాలుగు భాగాలు ఉండవు. పార్ట్ 2తో ఈ కథ ముగిసిపోతుంది.
ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో నిరాశకు గురయ్యారా?
ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం దురదృష్టకరం. ఆ ఈవెంట్‌లోనే అందరం కలుద్దాం అనుకున్నాం. చాలా మంది ఏం మాట్లాడాలో కూడా స్క్రిప్ట్ కూడా రాసుకున్నారు. రద్దు కావడం అందరికి బాధ కలిగించింది.
చిరంజీవితో మీ బాండింగ్ ఎలా ఉంది?
ఆయనతో నాకు ముందు నుంచి మంచి అనుబంధం ఉంది. ఆచార్య రిలీజ్ తర్వాత నాకు మెసేజ్ పెట్టిన మొదటి వ్యక్తి చిరంజీవి గారే. ‘నువ్వు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు రావాలి’అని మెసేజ్‌పెట్టారు. కొందరు ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.
జాన్వీ కపూర్ గురించి?
శ్రీదేవిగారి కూతురు కావడంతో జాన్వీ తెలుగమ్మాయిలాగే అనిపించేంది. చాలా టాలెంటెడ్. చాలా భయంతో సెట్‌లో అడుగుపెట్టేంది. తన డైలాగ్స్ ముందే పంపమని అడిగేది. బాగా ప్రాక్టీస్ చేసేది. మొదటి రోజు షూట్ అవ్వగానే ఆమె టాలెంట్ చూసి ఎన్టీఆర్ షాకయ్యాడు.
జాన్వీని హీరోయిన్‌గా తీసుకోవడానికి గల కారణం?
ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. దేవర సినిమాలో నటించాలని జాన్వీ ముందే అనుకుందట. అనుకోకుండా మేము కూడా ఆమెనే ఎంపిక చేసుకున్నాం. సెట్‌లో ఆమెను చూస్తే మన ఇంటి ఆడపిల్లలా అనిపించేంది.
సైప్ అలీఖాన్ గురించి?
నేను రాసుకున్న పాత్రకు సైఫ్ అలీఖాన్ అయితేనే బాగుంటుందని ముందు నుంచే అనుకున్నా. ఆయనకు స్టోరీ చెప్పి, ఆ పాత్ర లుక్ స్కెచ్ పంపిస్తే.. ‘నేను ఇలా ఉంటానా’అని ఆశ్చర్యపోయాడు. ఆయన మెకప్‌కే దాదాపు గంట సమయం పట్టేది.
సంగీత దర్శకుడు అనిరుధ్ గురించి?
మంచి సంగీతం అందించాడు. ఫియర్ సాంగ్ చూడగానే నా ఉత్సాహం రెట్టింపైంది. దేవీశ్రీ ప్రసాద్ నాకు మంచి హిట్ సాంగ్స్ ఇచ్చాడు. కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ అతనితో కలిసి పని చేస్తా.
Comments
Please login to add a commentAdd a comment