సైనికుడి ప్రయాణం ప్రతి మలుపూ ప్రమాదభరితం అన్న లైన్ తో ముడిపడున్న సినిమా ల్యాండ్ ఆఫ్ బ్యాడ్. అప్పట్లో ప్రపంచ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన యోధుడు గ్లాడియేటర్. ఆ గ్లాడియేటర్ పాత్రధారి రస్సెల్ క్రోవ్ నటించిన సినిమా ఈ ల్యాండ్ ఆఫ్ బ్యాడ్. ఈ సినిమాని దర్శకులు విలియమ్ యూబ్యాంక్ రూపొందించారు. ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ సినిమా ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా లభ్యమవుతుంది.
ఇక సినిమా కథ విషయానికొస్తే యూఎస్ డెల్టా ఫోర్స్ ఓ పెద్ద ఆపరేషన్ చేపడుతుంది. సౌత్ ఫిలిప్పీన్స్ లో తీవ్రవాదులచే బందీగా వున్న సిఐఎ సిబ్బందిని రక్షించడం ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. ఈ ఆపరేషన్ కు స్టాఫ్ సార్జెంట్ నియా బ్రాన్సన్ సారధ్యంలో ఓ టీం వెళుతుంది. ఆఖరి నిమిషంలో ఈ టీం కు కొత్తగా యంగ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసరైన కెన్నీ జాయిన్ అవుతాడు. ఈ కెన్నీయే మన సినిమాకు కథానాయకుడు. కెన్నీ పాత్రలో వర్ధమాన నటుడు లియామ్ హెమ్స్ వర్త్ నటించారు.
ఇక పోతే ఈ టీం కు రీపర్ గ్రిమ్ డ్రోన్ సపోర్ట్ గా వ్యవహరిస్తాడు. ఈ రీపర్ కథలో మరో ముఖ్య పాత్రధారి. రీపర్ పాత్రలో ప్రముఖ నటుడు రస్సెల్ క్రోవ్ నటించి మెప్పించాడు. నాడు గ్లాడియేటర్ గా నేడు రీపర్ గా రస్సెల్ క్రోవ్ నటన నభూతో నభవిష్యతి. యూఎస్ డెల్టా ఫోర్స్ టీం ఫిలిప్పీన్స్ ఆపరేషన్ కోసం బయలుదేరడంతో ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ కథ మొదలవుతుంది. టీం లో కెన్నీ కొత్తవాడవడం ఆ పై ఇది మొదటి ఆపరేషన్ అవడంతో టీం లోని మిగతావారు అతనిని ఆట పట్టిస్తుంటారు.
జాగ్రత్తగా వ్యవహరించమని సలహాలిస్తుంటారు. ఈ ఆపరేషన్ లో భాగంగా టీంలోని మిగతా సభ్యులందరూ ఓ సమయంలో గాయపడతారు. ఆపరేషన్ కొత్త అయినా, ఎవరూ తోడు లేకున్నా కెన్నీ తనకున్న ధైర్యంతో రీపర్ సాయంతో ఆపరేషన్ ఎలా ముగించాడన్నదే ఈ సినిమా కథ. సాధారణంగా టెర్రరిస్ట్ ఎలిమినేషన్ ఆపరేషన్ అంటే గన్ ఫైట్ తప్ప ఇంకేమీ వుండదని అనుకుంటాం. కానీ సున్నితమైన సెంటిమెంటల్ లైన్ తో చక్కటి గ్రప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా చూసే ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. వర్త్ టూ వాచ్ ఫర్ దిస్ వీకెండ్.
- ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment