వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలికిరెడ్డి నిర్మించారు. డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. సామాన్య కుటుంబానికి చెందిన బాలరాజు ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆయన ఆ హత్య చేయకపోయినా..అన్ని ఆధారాలు ఆయన చేసినట్లే ఉంటాయి. అలాంటి తరుణంలో బాలరాజు కేసును టేకాప్ చేస్తాడు వీర్(మకిలిరెడ్డి వీర్‌రెడ్డి). ఆ హత్య కేసు వెనుక చాలా మంది పెద్దలు ఉన్నారని తెలుసుకుంటాడు. లాయర్ వీర్ ఈ కేసును ఎలా డీల్ చేశాడు? బలరాజుకు న్యాయం చేసేందుకు వీర్ చేసిన సాహసాలేంటి? చివరకు ఈ హత్య కేసు నుంచి బాలరాజు బయటపడ్డాడా లేడా? అనేదే మిగతా కథ.
దర్శకుడు ఎంచుకున్న కోర్డు డ్రామా పాయింట్ బాగుంది. స్క్రీన్‌ప్లే చక్కగా రాసుకున్నాడు. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించడమే సినిమాకు మైనస్ అయింది. సాఫీగా సాగుతున్న కథకి యాక్షన్ బ్లాక్, రొమాంటిక్ సాంగ్స్ అడ్డంకిగా మారేయే తప్పా..ఎలాంటి వినోదాన్ని పంచలేదు. అయినప్పటికీ అసలు కథను డీవియేట్ చేయకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. అక్కడక్కడ వకీల్ సాబ్ తరహా సీన్స్ కనిపిస్తుంటాయి. టెక్నికల్ టీమ్ నుంచి తనకు కావాల్సిన ఔట్‌ఫుట్ తీసుకోవడంలో డైరెక్టర్ సఫలం అయ్యాడు. కాస్టింగ్ విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త పడి..అనుభవం ఉన్న నటీనటులను పెట్టుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.
లాయర్ వీర్ పాత్రకి మలికిరెడ్డి వీర్ రెడ్డి న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. స్క్రీన్ ప్రెజన్స్ బాగున్న్పటికీ..అనుభవ లేమి కారణంగా హావభావాలు పలికించడంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. బాలరాజు పాత్రను పోషించిన యువకుడు చక్కగా నటించాడు. బాలరాజు భార్యగా సీరియల్ నటి తనూజ పుట్టస్వామి తనదైన నటనతో ఆకట్టుకుంది. దివంగత ఢిల్లీ గణేశ్ ఈ చిత్రంలో తండ్రి పాత్రను పోషించాడు. దయానంద్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయినా.. సినిమాటోగ్రపీ, ప్రొడక్షన్స్ డిజైన్ బాగున్నాయి. హీరోనే నిర్మాత కావడంతో ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment