Veer Reddy
-
‘లీగల్లీ వీర్’ ఎలా ఉందంటే..?
వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలికిరెడ్డి నిర్మించారు. డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.ఈ సినిమా కథ విషయానికొస్తే.. సామాన్య కుటుంబానికి చెందిన బాలరాజు ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆయన ఆ హత్య చేయకపోయినా..అన్ని ఆధారాలు ఆయన చేసినట్లే ఉంటాయి. అలాంటి తరుణంలో బాలరాజు కేసును టేకాప్ చేస్తాడు వీర్(మకిలిరెడ్డి వీర్రెడ్డి). ఆ హత్య కేసు వెనుక చాలా మంది పెద్దలు ఉన్నారని తెలుసుకుంటాడు. లాయర్ వీర్ ఈ కేసును ఎలా డీల్ చేశాడు? బలరాజుకు న్యాయం చేసేందుకు వీర్ చేసిన సాహసాలేంటి? చివరకు ఈ హత్య కేసు నుంచి బాలరాజు బయటపడ్డాడా లేడా? అనేదే మిగతా కథ.దర్శకుడు ఎంచుకున్న కోర్డు డ్రామా పాయింట్ బాగుంది. స్క్రీన్‌ప్లే చక్కగా రాసుకున్నాడు. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించడమే సినిమాకు మైనస్ అయింది. సాఫీగా సాగుతున్న కథకి యాక్షన్ బ్లాక్, రొమాంటిక్ సాంగ్స్ అడ్డంకిగా మారేయే తప్పా..ఎలాంటి వినోదాన్ని పంచలేదు. అయినప్పటికీ అసలు కథను డీవియేట్ చేయకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. అక్కడక్కడ వకీల్ సాబ్ తరహా సీన్స్ కనిపిస్తుంటాయి. టెక్నికల్ టీమ్ నుంచి తనకు కావాల్సిన ఔట్‌ఫుట్ తీసుకోవడంలో డైరెక్టర్ సఫలం అయ్యాడు. కాస్టింగ్ విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త పడి..అనుభవం ఉన్న నటీనటులను పెట్టుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.లాయర్ వీర్ పాత్రకి మలికిరెడ్డి వీర్ రెడ్డి న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. స్క్రీన్ ప్రెజన్స్ బాగున్న్పటికీ..అనుభవ లేమి కారణంగా హావభావాలు పలికించడంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. బాలరాజు పాత్రను పోషించిన యువకుడు చక్కగా నటించాడు. బాలరాజు భార్యగా సీరియల్ నటి తనూజ పుట్టస్వామి తనదైన నటనతో ఆకట్టుకుంది. దివంగత ఢిల్లీ గణేశ్ ఈ చిత్రంలో తండ్రి పాత్రను పోషించాడు. దయానంద్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయినా.. సినిమాటోగ్రపీ, ప్రొడక్షన్స్ డిజైన్ బాగున్నాయి. హీరోనే నిర్మాత కావడంతో ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. -
Legally Veer: లీగల్ థ్రిల్లర్‌గా ‘లీగల్లీ వీర్’
వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘లీగల్లీ వీర్’. ఈ చిత్రానికి శాంతమ్మ మలికిరెడ్డి నిర్మాతగా వ్యవహరించగా.. రవి గోగుల దర్శకత్వం వహించారు. సోమవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో..హీరో, వీర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నాకు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదు. కరోనా టైంలో పాడ్ కాస్ట్ చేయాలని అనుకున్నాను. ఆ టైంలో నాకు సినిమా వాళ్ళతో పరిచయం ఏర్పడింది. మంచి సినిమా చేద్దాం అనుకున్న, లీగల్ లాయర్‌ను కాబట్టి నాకు ఈ పాత్రను చేయడం సులభంగా అనిపించింది. ఇంతవరకు మన దగ్గర లీగల్ థ్రిల్లర్ సినిమాలు అంతగా రాలేదు. రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నాను. నటనకు కొత్త కావడంతో నాకు చాలా కష్టంగా అనిపించింది. చాలా టేక్స్ తీసుకున్న. డబ్బింగ్లో ప్రాబ్లం వచ్చింది కానీ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. డిసెంబర్ 27 విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. డైరెక్టర్ రవి మాట్లాడుతూ.. ‘వీర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనిపిస్తుంది. గ్లింప్స్ చూశాకా నాకు మాటలు రావడం లేదు. మా సినిమాకి మీడియా ప్రోత్సహించి, ఆదరించాలి’ అని అన్నారు.కొరియోగ్రాఫర్ వల్లం కళాధర్ మాట్లాడుతూ.. ‘నిర్మాత వీర్ సార్ చాలా కూల్‌గా ఉంటారు.. ఇందులో నేను ఒక పాటకు కొరియోగ్రఫీ చేశాను. అది అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు.నటుడు గిరిధర్ మాట్లాడుతూ.. ‘కొత్త టీం అయినా కూడా సినిమా ని చాలా బాగా అద్భుతంగా చిత్రీకరించారు. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతోంది కానీ ఇలాంటి టీం ఇంత వరకు చూడలేదు’ అని అన్నారు.